బీచ్‌లు క్లోజ్, రాబోయే 5 రోజులు అత్యంత కీలకం.. హోంమంత్రి కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. తూర్పుమధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గడిచిన కొద్ది గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతూ విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 880 కిలోమీటర్లు, కాకినాడకు 980 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,080 కిలోమీటర్లు, బాపట్లకు 1,150 కిలోమీటర్ల దూరంలో నెలకొంది. ఇది ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారి, సోమవారం ఉదయానికి తుఫానుగా రూపాంతరం చెందనుంది. అక్కడితో ఆగకుండా మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా, బుధవారం ఉదయానికి 'అతి తీవ్ర తుఫాను'గా మరింత రౌద్రరూపం దాల్చనుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఈ అతి తీవ్ర తుఫాను బుధవారం మధ్యాహ్నానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా ఏకంగా 140 కిలోమీటర్ల భయానక వేగంతో పెనుగాలులు విరుచుకుపడనున్నాయి. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి కోస్తాంధ్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు మొదలై, మంగళ, బుధవారాల్లో తీరప్రాంత జిల్లాల్లో కుండపోతగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదముంది.

Severe Cyclone Alert in AP Home Minister Anitha Directs Officials to Evacuate Coastal Areas
Cyclone Arnab: భయంకరమైన తుఫాను.. ఏపీ తీరానికి ఎంత దూరంలో ఉందంటే..
Cyclone Arnab: భయంకరమైన తుఫాను.. ఏపీ తీరానికి ఎంత దూరంలో ఉందంటే..

హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు.. అధికారులకు హై అలర్ట్!

తుఫాను తీవ్రత దృష్ట్యా హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులు, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో అత్యవసర సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే ఐదు రోజుల పాటు అధికార యంత్రాంగం అంతా 'హై అలర్ట్'లో ఉండాలని స్పష్టం చేశారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రకటనల హోర్డింగ్స్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఏ క్షణంలోనైనా సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, తీరప్రాంతాల ప్రజలను అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు.. బీచ్‌లలో సెల్ఫీలపై నిషేధం!

సముద్రం అత్యంత అలజడిగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హోంమంత్రి ఖచ్చితమైన విజ్ఞప్తి చేశారు. పర్యాటకుల రక్షణ దృష్ట్యా బీచ్‌ల్లోకి ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. భారీగా ఎగసిపడే సముద్రపు అలల వద్ద సెల్ఫీలు దిగడం, సరదాగా వెళ్లడం వంటి సాహసాలు అస్సలు చేయవద్దని స్పష్టం చేశారు. రైతులు, తీరప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసర పుకార్లు, వదంతులు నమ్మవద్దని, కేవలం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), ఆర్టీజీఎస్ (RTGS) విడుదల చేసే అధికారిక హెచ్చరికలను మాత్రమే పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+