బీ అలర్ట్..ఉక్కిరి బిక్కిరి, జాగ్రత్తగా ఉండాల్సిందే..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు..వడగాల్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వడగాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలోని సుమారు 100 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కమలాపురంలో 44.7 డిగ్రీలు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 43.44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు, రేపు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు రోజుల తరువాత ఎండ తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఎండల ప్రభావానికి వాతావరణంలో వస్తున్న మార్పులతో వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆ తరువాత మరోసారి ఎండల తీవ్రత పెరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులపైన హెచ్చరించిన వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.

గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 125 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. ఇక శుక్రవారం 40 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళంలో 13 మండలాలు,
విశాఖపట్నం: 2, అల్లూరి జిల్లా: 7, అనకాపల్లి:15, ఏలూరు: 2, తూర్పు గోదావరి: 4, కాకినాడ: 10, గుంటూరు: 11, ఎన్టీఆర్: 12, కృష్ణా: 4, మన్యం: 11 మండలాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందిని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో చమట ఎక్కువ పడుతుంది కనుక సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్‌కు బదులు మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఉత్తమమని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications