వాయు'గండం', 5 రోజులు కుండ పోతే - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. వాయుగుండం దూసుకొస్తుంది. రేపు (శనివారం) ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేశారు. దీని ప్రభావంతో 5 రోజులపాటు మోస్తరు వర్షాల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. అటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ముందస్తు చర్యల పైన అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చాయి.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి, కాకినాడ, ప.గో., కోనసీమ, కర్నూలు ఎల్లో అలెర్ట్​ ఇచ్చారు. కాగా, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురస్తాయని తెలిపింది. కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఐ సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కృష్ణపట్నం మినహా మిగతా ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

imd-predicts-heavy-rains-for-ap-and-telangana-districts-in-next-five-days-red-alert-issued

వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండగా, మరోవైపు తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ, నేడు వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో హైదరాబాద్ తో సహా 21 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో.. ప్రభుత్వం జిల్లాల అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+