దూసుకొస్తున్న తుఫాను, నాలుగు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..!!
వరుస అల్పపీడనాలు ఏపీని వణికిస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. తాజాగా ఏర్పడిన అల్పపీడనం తో పాటుగా 27న మరో అల్ప పీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. దీని కారణంగా రానున్న నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. దీంతో, అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.
ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వానలతో పాటు, మరో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని చెప్పింది. దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని అంచనా వేసింది.

కాగా, ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ కర్ణాటక అంతటా పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తూర్పు-మధ్య, ప్రక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం తూర్పు-మధ్య బంగాళాఖాతం లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, యానాంలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయల సీమలో రేపు (శనివారం) మోస్తరు వానలు పడతాయని అంచనాగా వెల్లడించింది.












Click it and Unblock the Notifications