తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు, చురుగ్గా - రెండు రోజులు వర్షాలు..!!

ఎండ తీవ్రతకు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి బలహీన పడి వాయవ్య, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు.కేరళలోకి ప్రవేశించిన రుతువపనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి రుతు పవనాల ప్రవేశం పైన వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడించింది.

విస్తరిస్తున్న రుతుపవనాలు: రుతుపవనాలు కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 1 నాటికే కేరళలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు.. వాతావరణ మార్పులు, 'బిపర్జాయ్‌' తుఫాన కారణంగా లేటుగా ఆ రాష్ట్రాన్ని చేరాయి. రానున్న 24 గంటల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.

IMD Predicts Monsoon reach Telugu states on 14th june, Rains for two days in next Two days

మరో 48 గంటల్లో కేరళ అంతటా, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడంచింది. రుతుపవనాలు మరో మూడు, నాలుగు రోజుల్లో అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..14వ తేదీ వరకు ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు: ఏపీలోని జంగమహేశ్వరపురంలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా అనేకచోట్ల 40 డిగ్రీలు దాటింది. కాగా రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన తరువాత వాతావరణం చల్లబడుతుందన్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 సెల్సియస్‌ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గవచ్చని అంచనా వేసింది.

రెండు రోజులు వర్షాలు: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు వడగాడ్పులు వీయడంతోపాటు సాయంత్రానికి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాడ్పులు వీయవచ్చంటూ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి బలహీన పడి వాయవ్య, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజులు పాటు ఉరుములో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+