ఏపీకి తీవ్ర తుఫాన్: 29 వరకు భారీ వర్షాలు: ఐఎండీ బులెటిన్

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. శనివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా, ఆదివారం ఉదయానికి తుఫానుగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకువచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 25 నుంచి 28వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.

ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రరూపం దాల్చింది. అల్పపీడనంగా మారింది. వచ్చే 24 గంటల్లో ఇది వాయుగుండంగా, 25వ తేదీ నాటికి అతి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడి 26వ తేదీ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ తీరానికి సమీపిస్తుంది.

IMD Predicts severe Cyclone Likely by 26th October as Heavy Rain for Andhra Pradesh and Odisha

ఈ తీవ్ర తుఫాను ముప్పు కారణంగా ఏపీ తీరప్రాంత జిల్లాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. 26 నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా, యానాం, రాయలసీమల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 27 నుంచి 29 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి
జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి

మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన అల్పపీడనం వల్ల దక్షిణాది అంతటా వర్షాలు మరికొన్నిరోజుల పాటు కొనసాగుతాయి. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో ఈ నెల 27వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో 28న అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్ కారణంగా అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఈ నెల 29 వరకు వేటకు వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరించింది.

ఎల్లుండి బంగాళాఖాతంలో వాయుగుండం: ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఎల్లుండి బంగాళాఖాతంలో వాయుగుండం: ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

25వ తేదీ నుంచి మూడు రోజుల్లో మరింతగా బలపడి కోస్తాంధ్ర తీరం చేరే సూచనలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ప్రత్యేకించి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని అటు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఇదివరకే సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+