తెలుగు రాష్ట్రాల్లో రుతపవనాల రాకపై లేటెస్ట్ అప్ డేట్..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఒక వైపు ఉష్ణోగ్రతలు.. మరో వైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.
ఇదే సమయంలో రుతుపవనాల పైన వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. అటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఇటు హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

కొనసాగనున్న వడగాల్పులు :ఏపీ, తెలంగాణలో సాయంత్రం వరకు ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆ తరువాత పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇదే తరహా వాతావరణం కొనసాగుతోంది. ఏపీలో మరో రెండు రోజుల పాటుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తలు నిర్వహణ శాఖ అంచనా వేసింది.
ఏపీలో నేడు (గురువారం) 15 మండలాల్లో.. రేపు (శుక్రవారం) 302 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో ఈ రోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు:గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సీయస్ నుంచి 41 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని అంచనా వేసింది. బుధవారం రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కీతవారి గూడెంలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తరహా మిక్సడ్ వెదర్ తో డేంజర్ అని హెచ్చరిస్తున్న నిపుణులు జాగ్రత్త లు తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో రుతుపవనాల రాక పైన వాతావరణ శాఖ నిత్యం గమనాన్ని పరిశీలిస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లోనే రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశముందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అల్పపీడనం బలపడి తుఫానగా మారితే రుతుపవనాల విస్తరణపై ప్రభావం చూపనుంది.

రుతుపవనాల రాక:వీటిని పరిగణలోకి తీసుకున్న తరువాత జూన్ 8, 9వ తేదీల్లో రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సీమలో ప్రవేశించిన తరువాత క్రమేణా రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేస్తోంది. గత ఏడాది మే 30వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. కాగా, జూన్ 8వ తేదీన తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి.
ఈ సారి కేరళలో మరో రెండు రోజుల్లో రుతుపవనాలు చేరుకుంటే 8-10 తేదీల మధ్య తెలుగు రాష్ట్రాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే అయిదు రోజుల వరకు ఈ సారి ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల మేరకు వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్దం చేస్తోంది.












Click it and Unblock the Notifications