ఏపీలో ఈ జిల్లాల వాసులకు అలర్ట్ - రెండు రోజులు తప్పదు..!!
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తెల్లవారు జాము సమయంలో పలు జిల్లాలో భారీగా వర్షం కురిసింది. విజయవాడ, పల్నాడు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం కారణంగా పంట నష్టం జరిగింది. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల సమయంలో వాతావరణంలో ఈ అనూహ్య మార్పులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజున (మే 1) పల్నాడు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ రోజు, రేపు ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఉదయం సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి.

హైదరాబాద్ లో ఆదివారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చాలా సేపు ట్రాఫిక్ స్తంభించింది. సైదాబాద్‌లో ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు యాదాద్రి - భోంగీర్ నుంచి జనగాం, సిద్దిపేట నుంచి వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి - కొత్తగూడెంలో మళ్లీ మోస్తరు వర్షాలు - వనపర్తి, గద్వాల్, నాగర్‌కర్నూల్, సూర్యపేట, నల్గొండ, నల్గొండలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అటు ఏపీలోనూ వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం విజయవాడ నగరంలో ఆగకుండా గంటసేపు భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో పలువురు అవస్థలు పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగడం తో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. మరో రెండ్రోజుల పాటు ఏపీలో వర్షాలు తప్పవనే హెచ్చరికలు అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు జిల్లాల్లో చేతికి వచ్చిన పంటకు నష్టం జరిగింది. కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వాన, శ్రీశైల మల్లన్న దగ్గర వీధులన్నీ జలమయమయ్యాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ అకాల వర్షాల కారణంగా నష్టం తప్పటం లేదు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది.












Click it and Unblock the Notifications