తిరుమలకు వెళ్లడానికి పర్ఫెక్ట్ టైమ్.. నవంబర్‌లో శ్రీవారి దివ్య వేడుకలు

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రాబోయే నవంబర్ లో అనేక విశేష పర్వదినాలు, ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆస్థానాలు, వాహన సేవలతో ఏడుకొండలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నవంబర్ లో జరిగే ముఖ్యమైన కార్యక్రమాల వివరాలను టీటీడీ వెల్లడించింది.

ఈ నెలలో జరిగే ప్రధాన వేడుకల్లో భాగంగా నవంబర్ 2న తిరుమల నంబి ఉత్సవాలతో ఈ విశేష పర్వదినాలు ఆరంభం కానున్నాయి. 8వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరగనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థాన కార్యక్రమం ఏర్పాటవుతుంది. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్పస్వామి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.

Important festivals and religious events to be observed at Tirumala temple during the month of November

సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

తిరుమలలో ఇక చింత లేకుండా
తిరుమలలో ఇక చింత లేకుండా

నవంబర్ 13న నాగుల చవితి సందర్భంగా స్వామివారు పెద్దశేష వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అదే రోజు తిరుమల నంబి ఉత్సవాలతో పాటు శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర వేడుకలు పూర్తికానున్నాయి. 15, 16 తేదీల్లో శ్రీవారి పుష్పయాగం జరుగనుంది. అదే రోజున అత్రి మహర్షి, పిళ్లై లోకాచార్య, పోయ్ గై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమాలను నిర్వహిస్తారు. 19న యాజ్ఞవల్క్య జయంతి, 21న కైశిక ద్వాదశి ఆస్థానాన్ని నిర్వహిస్తారు అర్చకులు. అదే రోజు చక్రతీర్థ ముక్కోటి ఉత్సవం ఉంటుంది.

కార్తీకమాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త
కార్తీకమాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త

24వ తేదీన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని జరుపుతారు. 25న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రంతో ఈ నెల ప్రత్యేక ఉత్సవాల పరంపర పూర్తవుతుంది. కార్తీక మాసంలో పర్వదినాలు ఎక్కువగా ఉండటంతో తిరుమలకు భక్తుల రాక గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీపావళి ఆస్థాన సమయంలో కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేయనుంది. క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం రద్దు అవ్వొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+