బిగ్ అలర్ట్: ఏపీలో ముఖ్యమైన రైళ్ల సమయాలన్నీ మార్చిన రైల్వే

తరుచుగా రైల్లో ప్రయాణాలు చేసేవారికి రైల్వే టైంటేబుల్ పుస్తకం ట్రైన్స్ ఎట్ ఏ గ్లాన్స్ గురించి తెలుసు. గతంలో అక్టోబరు ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు టైంటేబుల్ రూపొందించేవారు. ఇటీవల జనవరి 1 నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు మార్పు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్ల పరిధిలో తిరుగుతున్న రైళ్లు, వాటి పేర్లు, వాటి సమయ వేళలన్నీ ఈ పుస్తకంలో అందుబాటులో ఉంటాయి. తాజాగా 45వ ఎడిషన్ ను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరుగుతున్న కొన్ని ముఖ్యమైన రైలు వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

విజయవాడ డివిజన్ పరిధిలో
విజయవాడ - విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718) ప్రతిరోజు ఉదయం 6.15 గంటలకు బదులుగా 6.00 గంటలకే బయలుదేరనుంది.
తిరుపతి - కాకినాడ టౌన్‌ (17249) రైలు విజయవాడలో ఉదయం 7.00 గంటలకు బదులు 6.25కు బయలుదేరుతుంది.
నాగర్‌సోల్ - షాలిమార్ (12659)‌ రైలు సాయంత్రం 4.10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3.15కే బయలుదేరనుంది.
తిరుపతి నుంచి పూరి వెళ్లే రైలు (17480) సాయంత్రం 6.35కి బదులు 6.10కు విజయవాడ నుంచి బయలుదేరుతుంది.
తిరుపతి - బిలాస్‌పూర్ (17482) రైలు‌ సాయంత్రం 6.35 గంటలకు బదులుగా 6.10 గంటలకే బయలుదేరుతుంది.
చెన్నై సెంట్రల్ - పూరి (22860) రైలు రాత్రి 11.35 గంటలకు బదులుగా 10.50 గంటలకే బయలుదేరుతుంది.
గుంటూరు - నర్సాపురం (17281) రైలు సాయంత్రం 6.50 గంటలకు బదులుగా 6.20 గంటలకే విజయవాడ నుంచి బయలుదేరుతుంది.

important trains timinigs change from january 1st in andhra pradesh

హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ పరిధిలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైలు వేళల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే వందేభారత్ రైళ్లకు అనుసంధానం చేసేలా వీటి సమయ వేళల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరికొన్ని రైల్వే స్టేషన్‌లకు రైళ్లు వచ్చే వేళల్లో మార్పులు, చేర్పులు చేశారు. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టంలో ఎంఎంటీఎస్ సమయవేళలు చూసుకోవచ్చన్నారు. చర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లకు, చర్లపల్లి స్టేషన్ కు చేరుకునే రైళ్లకు కూడా ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+