ఎంపీ మాధవ్ కేసులో అనూహ్య ట్విస్టు -వీడియో ఒరిజినల్ కాదు : టీడీపీ ఖాతా నుంచి తొలిసారిగా...!!
తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలోనూ సంచలనానికి కారణమైన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పైన పోలీసులు సంచలన ప్రకటన చేసారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని చెప్పుకొచ్చారు. వీడియో మార్ఫింగ్ లేకపోతే, ఎడిటెడ్ వీడియో అయి ఉండవచ్చని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. ఈ వీడియో తొలుత ఐ టీడీపీ అఫీషియల్ ఖాతా నుంచి తొలిసారి అప్ లోడ్ చేసినట్లుగా తేలిందని ఎస్పీ వెల్లడించారు. వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై ఫోరెన్సిక్ రిపోర్ట్ పై అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పూర్తి వివరాలను వెల్లడించారు.

ఒరిజినల్ వీడియో కాదు
ఇది మూడు లేదా నాలుగో వీడియో ఎడిట్ చేసిన వీడియోగా తేలిందన్నారు. ఒరిజనల్ వీడియో ఉంటేనే దానిని పరిగణలోకి తీసుకోవచ్చన్నారు. మార్ఫింగ్ చేసినట్లుగా వీడియో పైన ఫిర్యాదు వచ్చిందని..బాధితులు ఉన్నట్లుగా ఎవరూ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని వివరించారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్ తో వీడియో అప్ లోడ్ అయిందని ఎస్పీ వెల్లడించారు. అర్ద్రరాత్రి రెండు గంటల సమయంలో దీనిని అప్ లోడ్ చేసినట్లు వివరించారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకూ ఏమీ చెప్పలేమని ఎస్పీ వివరించారు. ఒరిజనల్ వీడియో దొరికితే ఎంపీ చెప్పినట్లుగా మార్ఫింగ్ జరిగిందా లేదా అనేది చెప్పగలమన్నారు. ఆ వీడియోను వేరే మొబైల్ లో చిత్రీకరించారని ఎస్పీ చెప్పారు.
ఐ టీడీపీ అఫీషియల్ ఖాతాలో తొలిగా
ఈ వీడియోను తొలిగా ఐ టీడీపీ అఫీషియల్ ఖాతాలో పోస్టు చేసినట్లుగా గుర్తించామని చెప్పిన ఎస్పీ..దీనికి సంబంధించి ఆరా తీస్తున్నామని చెప్పారు. బాధితులు ఎవరూ ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వివరించారు. వీడియో మార్ఫింగ్ పైన ఫిర్యాదు వచ్చిందని..దాని ఆధారంగానే విచారణ జరిగిందని చెప్పారు. బాధితులు ఎవ్వరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంపీ ఫోన్ కూడా వెరిఫై చేస్తామని ఎస్పీ వెల్లడించారు. బాధితులు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే..తాము స్వీకరించటంతో పాటుగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. దర్యాప్తులో ఒక పద్దతి ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఒర్జినల్ వీడియో వస్తేనే ఎఫ్ఎస్ఎల్ కు
ఈ మొత్తం వ్యవహారంలో అసలైన వీడియో వస్తేనే దానిని ఫోరెన్సిక్ లాబ్ కు పంపుతామన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో రకరకాలుగా ఉందన్నారు. బాధితులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వీడియో ఆధారంగా ఇది ఒర్జినల్ కాదనేది మాత్రం తేలిందన్నారు. రాజకీయంగా సంచలనానికి కారణమైన మాధవ్ వీడియో వ్యవహారంలో ఇప్పుడు ఎస్పీ క్లారిటీ ఇవ్వటంతో ..ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తీసుకుంటుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications