వైసీపీ ట్రాప్‌..టీడీపీ దొరికిపోయింది : జ‌గ‌న్ డిసైడ్ అయిపోయారు: స‌భ‌లో ర‌ంజైన రాజ‌కీయం..!

ఏపీ శాస‌న‌స‌భ‌లో రెండో రోజే రంజైన రాజ‌కీయం చోటు చేసుకుంది. ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న‌కు జ‌రిగిన అవ‌మానాల‌కు సభా వేదిక‌గా స‌మాచారం చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. వైసీపీ ట్రాప్‌లో చిక్కుకున్న టీడీపీ సెల్ప్‌గోల్ చేసుకుంది. వైసీపీ కోరుకున్న విధంగా టీడీపీ దొరికిపోయింది. ఒక‌, ఎంతో కాలంగా స‌భ‌లో ఇటువంటి స‌న్నివేశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ ఒక్క‌సారిగా విరుచుకుప‌డింది. గ‌త శాస‌న‌స‌భ‌లో ముఖ్య‌మంత్రి..స్పీక‌ర్ తీరును ఎండ‌గ‌ట్టారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకొనే ప్ర‌య‌త్నం చేసారు. చంద్ర‌బాబు వివ‌ర‌ణ చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీని ద్వారా...ఏపీ శాస‌న‌స‌భ‌లో స్పీక‌ర్ ఎన్నిక కంటే..ఈ రాజ‌కీయం ఎక్కువగా అంద‌రి దృష్టికి ఆక‌ర్షించింది.

టీడీపీ సెల్ఫ్‌గోల్..ఇలా దొరికిపోయింది..

టీడీపీ సెల్ఫ్‌గోల్..ఇలా దొరికిపోయింది..

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ త‌మ‌కు గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో శాస‌న‌స‌భ‌లో ఏ ర‌కంగా అయితే అవ‌మానాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చిందో..అదే స్థాయిలో టీడీపీకి రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని డిసైడ్ అయిపోయారు. శాస‌న‌స‌భ స్పీక‌ర్‌గా ఏక‌గ్రీవంగా త‌మ్మినేని సీతారం ఎన్నిక‌య్యారు. ప్రొటెం స్పీక‌ర్ ద్వారా అన్ని పార్టీల నేత‌లు వ‌చ్చి స్పీక‌ర్‌ను ఛైర్‌లో కూర్చోబెట్టాల‌ని ఆహ్వానించారు. ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ ముందుకు రాగా..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మాత్రం ముందుకు రాలేదు. పార్టీ ఉప నేత అచ్చంనాయుడును పంపారు. సరిగ్గా ఇదే వైసీపీ త‌మ అస్త్రంగా మ‌ల‌చుకొంది. ఒక బీసీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని స్పీక‌ర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్ర‌తిప‌క్ష నేత‌కు ఇష్టం లేద‌ని వైసీపీ మొద‌లు పెట్టేసింది. దీనికి చంద్ర‌బాబు మొద‌లు పార్టీ నేత‌లు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. కానీ, అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

మాకు గౌర‌వం ఇవ్వ‌లేదు..తిప్పికొట్టిన వైసీపీ.

మాకు గౌర‌వం ఇవ్వ‌లేదు..తిప్పికొట్టిన వైసీపీ.

స‌భ‌లో స్పీక‌ర్‌ను సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఛైర్ వద్ద‌కు తీసుకురావ‌టంలో ప్ర‌తిప‌క్ష నేత రాక‌పోవ‌టం పైన టీడీపీ స‌భ‌లోనే వివ‌ర‌ణ ఇచ్చింది. స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో గ‌తంలో త‌మ హ‌యాంలో త‌మ మంత్రుల‌ను జ‌గ‌న్ వ‌ద్ద‌కు పంపి స‌మాచారం ఇచ్చామ‌ని..అయితే, ఇప్పుడు ఆ స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌టంతో పాటుగా.. ప్ర‌భుత్వం స్పీక‌ర్ ను ఛైర్ లో కూర్చోబెట్టేందుకు ఆహ్వానించ‌లేద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన అధికార ప‌క్షం తాము స్పీక‌ర్ ఎన్నిక గురించి గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించిదీ పూర్తిగా రికార్డులు ప‌రిశీలించిన త‌రువాత‌నే ముందుకు వ‌చ్చామ‌ని..అదే విధంగా త‌మ సూచ‌న‌ల మేర‌కే ప్రొటెం స్పీక‌ర్ స్ప‌ష్టంగా అన్ని ప‌క్షాల నేత‌లు స్పీక‌ర్ ను ఆయ‌న ఛైర్‌లో గౌర‌వంగా కూర్చోబెట్టేందుకు రావాల‌ని ఆహ్వానించార‌ని గుర్తు చేసారు. తొలుత త‌మ‌కు ఎటువంటి స‌మాచారం లేద‌న్న టీడీపీ..ప్రొటెం స్పీక‌ర్ ఆహ్వానం గురించి ప్ర‌స్తావించ‌గా మిన్న‌కుండిపోయారు.

Recommended Video

    భాద్యతలు చేపట్టిన మంత్రులు..
    జ‌గ‌న్ ఇలా డిసైడ్ అయిపోయారు..

    జ‌గ‌న్ ఇలా డిసైడ్ అయిపోయారు..

    తాను తొలిసారి అసెంబ్లీకి వ‌చ్చిన స‌మ‌యంలో..ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌గా ఏ విధంగా నాటి ప్ర‌భుత్వం..స్పీక‌ర్ వ్య‌వ‌హ రించిందీ గుర్తు పెట్టుకున్న జ‌గ‌న్‌..ఇప్పుడు వాట‌న్నింటికీ స‌మాధానం చెప్పాల‌ని డిసైడ్ అయిపోయారు. అందులో భాగంగానే.. నాటి ఫిరాయింపులు..స్పీక‌ర్ తీరుపైన ముఖ్య‌మంత్రి మొద‌లు పార్టీ ఎమ్మెల్యేలు వ‌రుస పెట్టి టీడీపీని టార్గెట్ చేసారు. స్పీక‌ర్ త‌మ్మినేని ఎంపిక కంటే..దీని పైనే ఎక్కువ‌గా మాట్లాడారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ తాను విలు వ‌లు కాపాడేందుకు ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించిందీ..స‌భ ద్వారా చెప్పుకొనే అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. ఇక‌, చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని ఫైర్ అయ్యారు. ఇక‌, భ‌విష్య‌త్‌లోనూ జ‌గ‌న్ ఇతే త‌ర‌హాలో కొన‌సాగే అవ‌కాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+