జగన్‌కు అదే కలిసొచ్చే అంశం: అదే బాబు ఓటమికి కారణం అవుతుంది: బీజేపీ నేత మురళీధర రావు..!
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రంలో హంగ్ వస్తే దక్షిణాదిన ఉన్న పార్టీల సీట్టే వారికి కీలకం కానున్నాయి. దీని కోసం ఇప్పటికే వారు సంప్రదింపులు సైతం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో వైసిపికి లోక్‌సభ సీట్లు గణనీయంగా వస్తాయనే సర్వేల ఆధారంగా జాతీయ పార్టీలు ఏపీలో ఎన్నికల ఫలితాల పైన ఆసక్తిగా ఉన్నారు. తాజగా, బిజేపీ సీనియర్ నేత మురళీధర రావు చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తి కరంగా మారాయి.
జగన్‌కు అదే కలిసొచ్చింది..
ఏపీలో అయిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన స్వయంకృతాపరాధాలే ఆయన ఓటమికి కారణంగా నిలుస్తోందని బీజేపీ సీనియర్ నేత మురళీధర రావు వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ అధినేత జగన్‌కు కలిసొచ్చే అంశంగా కనబడుతుందన్నారు. ఇక, తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాకపోతే బలోపేతం అయ్యేందుకు కొంత సమయం పడుతుందన్నారు. కచ్చితంగా తెలంగాణలో బలోపేతం అవుతామని వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా మోదీకి ప్రత్యామ్నాయం కనిపించే పరిస్థితి లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప.. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఈసారి కూడా 280కి పైగా స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ 75 స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవన్నారు. మే 23 తర్వాత కేంద్రంలో ఏం జరుగుతుందో చూడాలని సూచించారు.

దక్షిణాదిన తేల్చాల్సింది జగన్ ఒక్కరే..
ఇక, ఇదే సమయంలో దక్షిణాదిన అన్ని పార్టీలు ఇప్పటికే జాతీయ స్థాయిలో అటు బీజేపీ లేదా వ్యతిరేక కూటముల్లో భాగస్వామిగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దక్షిణాదిన ఉన్న డీఎంకే, జనతాదళ్ (ఎస్) వంటి పార్టీల నేతలను కలిసి మద్దతు కోరినా..అంత సానుకూలత వ్యక్తం కాలేదు. ఇదే సమయంలో ఏపీలో చంద్రబాబు ఇప్పటికే బిజేపీతర కూటమిలో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ తాము ఏపీకీ ఎవరు ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మద్దతిస్తామని ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన వచ్చిన సమమయంలోనూ కేసీఆర్‌కు అనుకూలంగానే మాట్లాడారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ - బీజేపీ సైతం జగన్ మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో..ఫలితాలు వచ్చిన తరువాత మాత్రమే జగన్ జాతీయ స్థాయిలో తాము ఎవరితో కలిసి ఉండేది స్పష్టత ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications