మారిన లెక్క- 118 సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించనున్న చంద్రబాబు-పవన్
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఉమ్మడిగా అభ్యర్ధుల ప్రకటనకు సిద్దమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటనకు సిద్దమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఇరువురు నేతలు..ఇవాళ దాదాపు 60 సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటిస్తారని భావించినా ఆ లెక్క చివరి నిమిషంలో మారిపోయింది. చివర్లో అనూహ్యంగా మరికొందరు అభ్యర్ధుల్ని కూడా కలిపి లిస్ట్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ-జనసేన అభ్యర్ధుల ఉమ్మడి జాబితాపై గత కొన్ని నెలలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇరువురు నేతల మధ్య పలుమార్లు జరిగిన చర్చల్లో చాలా వరకూ అభ్యర్ధులపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ వివరాలను మాత్రం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి ఇవాళ తొలి విడత అభ్యర్ధుల ప్రకటనకు సిద్ధమైనా నిన్న కూడా కేవలం 60 సీట్ల వరకే ప్రకటిస్తామని లీకులు ఇచ్చారు. కానీ అంతలోనే సీన్ మారిపోయింది.
టీడీపీ, జనసేన తొలి జాబితాలో సీటు దక్కించుకోవడానికి ఇరు పార్టీల నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అధినేతలపైనా ఒత్తిడి తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ 60 సీట్లకు బదులు ఏకంగా 118 సీట్లలో ఉమ్మడిగా అభ్యర్ధుల ప్రకటనకు అధినేతలు సిద్ధమయ్యారు. ఇందులో టీడీపీ తరఫున 70కు పైగా సీట్లలో అభ్యర్ధుల్ని ప్రకటించే అవకాశముంది. అలాగే జనసేన తరఫున పూర్తి స్ధాయిలో అభ్యర్ధుల్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications