తిరుమలలో అదనపు ఏర్పాట్లు

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు ఏకంగా 75,096 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 36,262 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.93 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

Increase in the number of devotees visiting Tirumala

అన్ని విభాగాల అధికారుల స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా టీటీడీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి, అళ్వార్ ట్యాంక్, కృష్ణతేజ, శిలాతోరణం వద్ద గల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంత‌రాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేస్తోంది.

వేసవి రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కిందటి నెల 15వ తేదీ నుండి భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది. గత మూడు వారాలుగా దీనికి భిన్నమైన పరిస్థితులు తిరుమలలో నేెలకొన్నాయి.

శుక్రవారం నాడు సాధారణంగా 60,000 నుండి 65,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుంటారు. మే 15వ తేదీ నుంచి శుక్రవారాలలో దాదాపు 10,000 మందికి పైగా భక్తులకు అదనంగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందగలుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శుక్రవారాలైన మే 23న 74,374, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ 13వ తేదీన రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. రద్దీ కారణంగా నారాయణగిరి షెడ్ల వద్ద అదనపు ఏర్పాట్లు సైతం చేసింది టీటీడీ. భక్తులకు అన్న పానీయాలను అందిస్తోంది.

మే నుంచి ప్రతిరోజూ సగటున 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90,000కు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తోన్నారు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు. మే 24న ఒక్కరోజే మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+