అసభ్య పోస్టర్లు: వర్మ దిష్టిబొమ్మ దహనం(పిక్చర్స్)
విశాఖపట్నం: మహిళలను కించపర్చేలా సినిమాలు తీస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం ఆయా యూనియన్ల ప్రతినిధులు నగరంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా జగదాంబ జంక్షన్ వద్ద రాంగోపాల్ వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఐద్వా అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ.. మహిళలను అశీలంగా చూపించడానికి రాంగోపాల్ వర్మ ‘శ్రీదేవి' చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఆక్షేపించారు. ఒక ఉపాధ్యాయురాలిని అసభ్యంగా చూపించిన తీరు సినిమా పోస్టర్‌లో ఉందన్నారు.

నిరసన
మహిళలను కించపర్చేలా సినిమాలు తీస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు డిమాండ్ చేశాయి.

నిరసన
సోమవారం ఆయా యూనియన్ల ప్రతినిధులు విశాఖపట్నం నగరంలో ఆందోళన చేపట్టారు.

నిరసన
ఈ సందర్భంగా జగదాంబ జంక్షన్ వద్ద రాంగోపాల్ వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

నిరసన
ఐద్వా అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ.. మహిళలను అశీలంగా చూపించడానికి రాంగోపాల్ వర్మ ‘శ్రీదేవి' చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఆక్షేపించారు.

నిరసన
ఒక ఉపాధ్యాయురాలిని అసభ్యంగా చూపించిన తీరు సినిమా పోస్టర్‌లో ఉందన్నారు.

నిరసన
ఓ విద్యార్థికి టీచర్‌పై ఆకర్షణ ఎలా ఉంటుందో ఆ విద్యార్థి చూపులపై సినిమా తీయబోతున్నారని ధ్వజమెత్తారు. అటువంటి అనుభవాలు ఎవరికైనా ఉంటే తనకు తెలియజేయాలని వర్మ కోరడం తగదన్నారు.

నిరసన
సినిమాల ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలే తప్ప అసభ్య సన్నివేశాలను చూపించడం అమానుషమన్నారు.
ఓ విద్యార్థికి టీచర్‌పై ఆకర్షణ ఎలా ఉంటుందో ఆ విద్యార్థి చూపులపై సినిమా తీయబోతున్నారని ధ్వజమెత్తారు. అటువంటి అనుభవాలు ఎవరికైనా ఉంటే తనకు తెలియజేయాలని వర్మ కోరడం తగదన్నారు. సినిమాల ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలే తప్ప అసభ్య సన్నివేశాలను చూపించడం అమానుషమన్నారు.
వర్మ చిత్రీకరిస్తున్న ‘శ్రీదేవి' సినిమా నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి అతడ్ని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజాసంఘాల ప్రతినిధులు వివి శ్రీనివాస్, రాజా, జగన్నాథం, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications