మనుషులను చంపొచ్చు.. కానీ ఆలోచనలను చంపలేం
ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎందరో మహానుభావుల త్యాగాలకు చిహ్నం. దేశవ్యాప్తంగా మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. దేశ సంస్కృతి ఉట్టపడేలా కార్యక్రమాలుంటాయి. పేరెన్నికగన్న నేతలు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలను వ్యాఖ్యల రూపంలో మీకు అందజేస్తున్నాం. మీ స్నేహితులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇవి ఉపయోగపడతాయి.
మనం ఎప్పుడూ తలెత్తుకునే ఉండాలని పూర్వీకులు చెప్పారు. మనం మన జీవితాలను గౌరవంతో గడుపుదాం. శాంతి భద్రతలను కాపాడదాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ప్రపంచం అర్థరాత్రి నిద్రపోతున్న వేళ భారతదేశం స్వేచ్ఛ, కొత్త జీవితం కోసం మేల్కొంటుంది - జవహర్ లాల్ నెహ్రూ

మనుషులను చంపొచ్చు.. కానీ ఆలోచనలను చంపలేం. ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి. కానీ ఆలోచనలు మాత్రం జీవించే ఉన్నాయి - భగత్ సింగ్
దేశంపట్ల మీ ప్రేమ, అభిమానం స్వాతంత్ర్య దినోత్సవంరోజు ప్రతిధ్వనించాలి.
మీ రక్తం మరగకపోతే, మీ నరాల్లో పారుతోంది రక్తం కాదు. నీరు. మాతృభూమికి సేవ చేయకపోతే యువత ఉండి ఎందుకు? - చంద్రశేఖర్ ఆజాద్
దేశంపట్ల నా ప్రేమకు సరిహద్దులు లేవు. నా ప్రజలపట్ల నా ప్రేమ అంతులేనిది. దేశం ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ ప్రత్యేకమైన రోజున మీకు, మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
జాతి తల్లుల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఉండే ప్రేమ, త్యాగాలపైనే దేశ గొప్పతనం ఆధారపడి ఉంటుంది. - సరోజినీ నాయుడు
సామాజిక స్వేచ్ఛ లభించనంత వరకు చట్టాలు ఇచ్చే స్వతంత్రతతో మీకు ప్రయోజనం ఉండదు.
విద్యను దాచుకోవడం కన్నా అందరికి పంచితే మరింత పెరుగుతుంది - మహాత్మా గాంధీ
మరణానికి భయపడడం అంటే, చినిగిపోయినా బట్టని వదిలేందుకు భయపడడం - మహాత్మా గాంధీ
నిరక్షరాస్యురాలైన తల్లి తన పిల్లల్ని నిండు హృదయంతో ప్రేమిస్తుంది - మహాత్మా గాంధీ
ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి- మహాత్మా గాంధీ












Click it and Unblock the Notifications