గోల్కొండ కోటలో కళాకారుల ప్రదర్శనలు (పిక్చర్స్ )
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాదులోని గోల్కొండ కోటలో అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శుక్రవారం తొలిసారి గోల్కొండ కోటలో ఈ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను వదిలేసి గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించాలని తలపెట్టారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోట కళ ప్రదర్శనతో కళకళలాడింది. వివిధ రంగాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. గోల్కొండ కోట వైభవం గురించి కెసిఆర్ తన ప్రసంగంలో చెప్పారు.
ప్రేక్షకులను మైమరిపించే విధంగా కళా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలంగాణ కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

జాతీయ జెండాతో ఇలా...
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ వ్యక్తి ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

చెక్ చేసి లోనికి...
గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పాసులు జారీ చేశారు. వాటిని తనిఖీ చేసి పోలీసులు లోనికి అనుమతించారు.

నిఘా ఇలా...
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసులు గట్టి భద్రతను, నిఘాను ఏర్పాటు చేశారు.

కళాకారుల విన్యాసం...
కళాకారులు తమ ప్రదర్శనలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అదనపు అందాన్ని, ఆనందాన్ని తెచ్చిపెట్టారు.

కోట గోడపై ఇలా...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోట గోడపై కొమ్ము ఊదుతూ ఇలా... గోల్కొండ కోటకు అందాన్ని తెస్తూ..

లంబాడా నృత్యాలు...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో శుక్రవారం లంబాడాలు తమదైన నృత్యాన్ని ప్రదర్శించారు.

ప్రాచీన వైభవాన్ని గుర్తు చేస్తూ...
గోల్కొండ కోట ప్రాచీన వైభవాన్ని తెలియజేస్తూ కళాకారులు ఇలా తమ కళాప్రదర్శనకు నైపుణ్యం అద్దారు.

గట్టి భద్రత...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భద్రతా బలగాలు, పోలీసు బలగాలు గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి.

శోభాయమానంగా...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోట శోభాయమానంగా రూపుదిద్దుకుంది. ఇలా వైభవం ఉట్టిపడేలా..

కళాప్రదర్శన ఇలా...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ జానపద కళాప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

జానపద కళాప్రదర్శన
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో తెలంగాణ జానపద కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు.

సంప్రదాయ నృత్యం...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ కళాకారులు సంప్రదాయ నృత్యరీతులను కూడా ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications