విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమానం నడిపిన రతన్ టాటా, ఎక్కడైనా నా పేరు వాడుకోండి: బాబుతో టాటా

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రతన్ టాటా సోమవారం నాడు పైలట్‌గా మారారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ కోసం ఆయన ముంబై నుంచి విజయవాడకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

India's Srimanthudu To Adopt Vijayawada

ఇందుకోసం ఆయన ఓ చిన్న విమానాన్ని వినియోగించారు. సదరు విమానాన్ని రతన్ టాటానే స్వయంగా ముంబై నుంచి విజయవాడకు నడుపుకుంటూ వచ్చారు. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో విమానం వద్దకెళ్లిన రతన్ టాటా నేరుగా పైలట్ సీట్లో కూర్చుకున్నారు.

India's Srimanthudu To Adopt Vijayawada

సీటు బెల్టు తగిలించుకున్న ఆయన విమానాన్ని పైకి ఎగిరించారు. మొత్తం 13 సీట్లున్న విమానంలో రతన్ టాటా వెంట తొమ్మిది మంది వచ్చారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చెప్పారు. రతన్ టాటా సుమారు సాయంత్రం 7.45 నిమిషాలకు విమాంలో ఢిల్లీ పయనమయ్యారు.

నా పేరు వాడుకోండి: టాటా

భారత దేశంలో ఏపీని కంపెనీల స్థాపన కేంద్రంగా చేద్దామని, పారిశ్రామిక వర్గాల్లో ఏం చేయాలో తనకు చెప్పాలని, తనకు ఉన్న విస్తృత పరిచయాలను వినియోగించుకోవాలని, అవసరమైతే నేనే వెళ్లి చేసుకొని వస్తానని మీకు నేను పూర్తి సహకారం ఇస్తానని రతన్ టాటా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో చెప్పారు.

విజయవాడలో ఇద్దరు సమావేశణైనప్పుడు ఆసక్తికర సంభాషణ జరిగిందని తెలుస్తోంది. మీలాంటి నాయకులు అవసరమని, స్వార్థపరులు రాజ్యాలను ఏలుతున్నారని, రాష్ట్రానికి దేశానికి మంచి నాయకులు అవసరమని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

India's Srimanthudu To Adopt Vijayawada

తనకు చాలా పరిచయాలు ఉన్నాయని, వ్యక్తిగా నా ప్రితష్టను ఎక్కడ కావాలంటే అక్కడ మీరు వాడుకోవచచునని, టాటా కంపెనీ తరఫున నేను ఎలాంటి హామీలు కూడా ఇవ్వనని, ఇప్పుడు గ్రూపు చైర్మన్‌ను కాదని, ట్రస్ట్‌కు మాత్రమే చైర్మన్‌ని అని, దాని తరఫున ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. కాగా, రతన్ టాటా ఏపీలో 264 గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

English summary
Honorary Chairman of Tata Trust, Ratan Tata met the Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu at the CM's Camp Office in Vijayawada this morning. The leading industrialist and the CM discussed the possibilities of investing in the state and also to chalk out steps to develop the industrial corridor in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X