ఏపీ ఎన్నికలపై ఇండియా టీవీ సర్వే - జనం మొగ్గు అటే - ఎన్ని సీట్లో తెలుసా ?
ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటికే పలు సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని అధికార వైసీపీకి మొగ్గు చూపగా.. మరికొన్ని విపక్ష ఎన్డీయే కూటమికి జై కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా జాతీయ మీడియా ఛానల్ ఇండియా టీవీ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇందులో ఏపీలో ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపుతున్నారనేది తమ అంచనా వెల్లడించింది.
ఏపీలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందనే అంశంపై ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. వీటి ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇందులో ఏపీలోని 25 ఎంపీ సీట్లలో అధికార వైసీపీ కేవలం 10 సీట్లు మాత్రమే దక్కించుకోబోతున్నట్లు తేలింది. ప్రస్తుతం 22 ఎంపీ సీట్లు కలిగి ఉన్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఏకంగా 12 సీట్లు కోల్పోయి 10 సీట్లకు పరిమితం కాబోతున్నట్లు ఇండియా టీవీ తెలిపింది.

మరోవైపు వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఎన్డీయే కూటమికి మాత్రం ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అయితే క్లీన్ స్వీప్ చేసే పరిస్దితులు మాత్రం లేవని తేలిపోయింది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని టీడీపీకి 12 ఎంపీ సీట్లు వస్తాయని, అలాగే బీజేపీ 3 సీట్లు గెల్చుకుంటుందని ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఇదే కూటమిలోని జనసేన కూడా రెండు సీట్లలో పోటి చేస్తున్నా ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ పోల్ ఫలితాలు పేర్కొనలేదు.
ఈ లెక్కను అసెంబ్లీ ఫలితాలకు వర్తింపచేస్తే టీడీపీ 12 ఎంపీ సీట్లలో అంటే దాదాపు 84 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది. అలాగే బీజేపీ 3 సీట్లలో అంటే 21 సీట్లలో ఆధిక్యం అందుకోవచ్చు. కానీ బీజేపీ కేవలం 10 సీట్లలోనే పోటీ చేస్తోంది కాబట్టి మిగతా స్ధానాల్లో ఈ ఓటింగ్ కూటమిలో ఇతర పార్టీలకు పడొచ్చు. అలాగే వైసీపీ 10 ఎంపీ సీట్లు సాధిస్తే 70 సీట్ల వరకూ వచ్చే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications