ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఏపీ, తెలంగాణతోపాటు రాష్ట్రాల వారీగా పార్టీల సీట్లు ఇలా

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై అంచనా వేసింది ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్. లోక్‌సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే.. 543 సభల్లో 318 లోక్‌సభ స్థానాలతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ అభిప్రాయ సేకరణ అంచనా వేసింది. ఈ ఫలితాలు శనివారం న్యూస్ ఛానెల్‌లో ప్రత్యేక షో "దేశ్ కీ ఆవాజ్"లో ప్రసారం చేసింది.

ఈ అంచనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కలయిక ఇండియా(I.N.D.I.A)కు 175 స్థానాలు, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులతో సహా 'ఇతరులకు' 50 సీట్లు రావచ్చు. లోక్‌సభలో ప్రధాని మోడీ అధికార భారతీయ జనతా పార్టీ బలం ఈసారి 303 నుంచి 290కి తగ్గవచ్చని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. మరోవైపు, 52 సీట్లతో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈసారి తన సంఖ్యను 66కి పెంచుకోవచ్చని అంచనా వేసింది. ఇక రాష్ట్రాల వారీగా పార్టీలకు వచ్చే లోక్‌సభ స్థానాలను గమనించినట్లయితే..

India TV-CNX poll

రాష్ట్రాల వారీగా పార్టీలకు వచ్చేసీట్లు అంచనా:

ఉత్తరప్రదేశ్ (80): ఎన్డీఏ 73, ఇండియా కూటమి 7

బీహార్ (40): NDA 24, ఇండియా కూటమి 16

మహారాష్ట్ర (48): NDA 24, ఇండియా కూటమి 24

తమిళనాడు (39): NDA 9 ఇండియా కూటమి 30

పశ్చిమ బెంగాల్ (42): NDA 12, ఇండియా కూటమి 30

కర్ణాటక (28): NDA 20, ఇండియా కూటమి 7, ఇతరులు 1

గుజరాత్ (26): NDA 26, ఇండియా కూటమి 0

కేరళ (20): NDA 0 , ఇండియా కూటమి 20

రాజస్థాన్ (25): NDA 21, ఇండియా కూటమి 4

ఆంధ్రప్రదేశ్ (25): NDA 0, ఇండియా కూటమి 0, ఇతరులు 25

ఒడిశా (21): NDA 8, ఇండియా కూటమి 0, ఇతరులు 13

మధ్యప్రదేశ్ (29): NDA 24, ఇండియా కూటమి 5

తెలంగాణ (17): NDA 6, ఇండియా కూటమి 2, ఇతరులు 9

అస్సాం(14): NDA 12, ఇండియా కూటమి 1, ఇతరులు 1

ఛత్తీస్‌గఢ్(11): NDA 7, ఇండియా కూటమి 4

జార్ఖండ్ (14): NDA 13, ఇండియా కూటమి 1

హర్యానా (10): NDA 8, ఇండియా కూటమి 2

పంజాబ్ (13): NDA 0, ఇండియా కూటమి 13

ఢిల్లీ (7): NDA 5, ఇండియా కూటమి 2

ఉత్తరాఖండ్ (5): NDA 5, ఇండియా కూటమి 0

జమ్మూకాశ్మీర్ లడఖ్ (6): NDA 3, ఇండియా కూటమి 2, ఇతరులు 1

హిమాచల్ ప్రదేశ్ (4): NDA 3, ఇండియా కూటమి 1

మణిపూర్ (2): NDA 0, ఇండియా కూటమి 2

ఇతర ఈశాన్య రాష్ట్రాలు (9): NDA 9, ఇండియా కూటమి 0

గోవా (2): NDA 2 , ఇండియా కూటమి 0

మిగిలిన యూటీ సీట్లు మైనస్ లడఖ్(6): NDA 4, ఇండియా కూటమి 2

మొత్తం 543, NDA 318, ఇండియా కూటమి 175, ఇతరులు 50

ప్రధాన పార్టీల వారీగా సీట్లు ఇలా:

బీజేపీ 290, కాంగ్రెస్ 66, ఆమ్ ఆద్మీ పార్టీ 10, టీఎంసీ 29, బీజేడీ 13, శివసేన 9 (షిండే) 2, శివసేన (యూబీటీ) 11, సమాజ్ వాదీ పార్టీ 4, బహుజన్ సమాజ్ పార్టీ 0, రాష్ట్రీయ జనతాదళ్ 7, జనతాదళ్-యూ 7, డీఎంకే 19 , ఏఐఏడీఎంకే 8, ఎన్సీపీ(శరద్) 4, ఎన్సీపీ(అజిత్) 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ 18, టీడీపీ 7, లెఫ్ట్ ఫ్రంట్ 8, బీఆర్ఎస్ 8, స్వతంత్రులు సహా ఇతరులు 30 సీట్లు సాధిస్తారని అంచనా. కాగా, మొత్తం లోక్‌సభ సీట్లు 543 సీట్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+