వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Indian index rankings 2022 : ఏయే ఉత్పత్తుల్లో ఏపీ టాప్ లో ఉందో తెలుసా ? వివరాలివే..

|
Google Oneindia TeluguNews

తాజాగా విడుదలైన ఇండియన్ ఇండెక్స్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ పలు ఉత్పత్తుల్లో టాప్ లో నిలిచింది. అసలే కరోనా తర్వాత క్రమంగా కోలుకుంటున్న ఆర్ధిక వ్యవస్ధకు ఈ న్యూస్ ఊతమిచ్చేలా ఉంది. ఈ జాబితాలో ఏపీలో ఉత్పత్తి అవుతున్న పలు ఉత్పత్తులు దేశవ్యాప్తంగా టాప్ 5లో చోటు సంపాదించాయి.

ఇండియన్ ఇండెక్స్ తాజా ర్యాంకుల్లో అరటిపళ్లు, స్వీట్ ఆరెంజ్, చేపలు, ఎండు మిర్చి, బొప్పాయి, టమోటా, కొకోవా, జీలకర్ర, పామోయిల్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ లో నిలిచింది. అలాగే పువ్వులు, నిమ్మకాయలు, కర్బూజ, పుచ్చకాయలు, జీడిపప్పు, మామిడిపండ్ల ఉత్పత్తిలో ఏపీ రెండో స్ధానంలో నిలిచింది. ఈ ర్యాంకుల్లో కొబ్బరికాయల ఉత్పత్తిలో ఏపీ నాలుగో స్ధానంలో నిలిచింది.

Indian index rankings 2022 : several products from ap stands in top five positions

ఈ ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో ఏయే ఉత్పత్తులు ఎక్కువగా ఉందనే అంశాల్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంటాయి. అలాగే వ్యాపారులకు కూడా ఈ ర్యాంకులు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. జాతీయోత్పత్తి లెక్కింపు విషయంలోనూ ఈ ర్యాంకులకు ప్రత్యేక స్ధానముంది. దీంతో ఇండియన్ ఇండెక్స్ ర్యాంకుల్లో టాప్ లో నిలిచేందుకు రాష్ట్రాలు ప్రయత్నిస్తుంటాయి. అయితే స్ధానికంగా దొరికే లేదా పండే పలు ఉత్పత్తులు ఇందులో కీలకపాత్ర పోషిస్తుంటాయి. స్ధానికంగా ప్రభుత్వాలు కూడా వాటికే ఎక్కువగా ప్రోత్సాహం కల్పిస్తుంటాయి. అరుదుగా మాత్రమే ఇతర రాష్ట్రాల ఉత్పత్తులకు స్ధానికంగా ప్రోత్సాహం కల్పిస్తుంటారు.

English summary
ap stand top in several products in recently released indian index ranks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X