ఏపీకి వాతావరణశాఖ కీలక సూచన
పోలింగ్ రోజు వచ్చేసరికి ఓటర్లకు ఎటువంటి అవాంతరం కలగనివ్వకుండా చూడాలని వరుణదేవుడు భావించినట్లున్నాడు. అందుకే వాతావరణం చల్లబడింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ అవి మరీ భయపెట్టేలా, బయటకు రానివ్వకుండా ఉండేలా లేవు. సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
15 వరకు మోస్తారు వర్షాలు
ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో ఈనెల 15వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తా, ఉత్తరాంధ్రతో పోల్చుకుంటే రాయలసీమలో కాస్తంత ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15వ తేదీ తర్వాత ఎండలు మరింత వేడెక్కుతాయని భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, గోవా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడులో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖాండ్‌లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది.

50 కిలోమీటర్ల వేగంతో గాలులు
మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో, విదర్భ, ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడా ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురవనున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉత్తరాఖండ్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా గాలులు వీయనున్నాయి. తీర ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేంద్ర వాతావరణశాఖ అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications