ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు మాత్రమే ఈ శుభవార్త!

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట ఎలా జరిగిందో ప్రపంచమంతా చూసింది. తన సొంతగడ్డపై ఎట్టకేలకు బాలక్ రామ్ కొలువుదీరాడు. సుకుమార సుందర రూపుడైనటువంటి ఆ రామ్ లల్లాను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అయోధ్యతోపాటు రైళ్లల్లో కూడా తీవ్ర రద్దీ నెలకొనడంతో భారతీయ రైల్వే అధికారులు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేరుగా అయోధ్యకు రైళ్లు ఏర్పాటు చేశారు.

రాజమండ్రి, సామర్లకోట, తుని స్టేషన్ల నుంచి కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునేవారు ఇక రైళ్లు మారాల్సిన అవసరం కూడా లేదు. గతంలో రాజమండ్రి నుంచి విశాఖ వరకు ఒక రైలు, అక్కడి నుంచి భువనేశ్వర్ వరకు మరో రైలు, అక్కడి నుంచి కాశీ లేదంటే అయోధ్య వెళ్లడానికి మరో రైలు ఎక్కాల్సి ఉండేది. ప్రయాణికులకు ఈ తరహా ప్రయాణ అనుభవాన్ని తొలగించడానికి, నేరుగా ఒకే రైలులో వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 07218 నెంబరుతో ఈనెల 11వ తేదీ నుంచి సామర్లకోట నుంచి అయోధ్య వెళ్లే రైలు ఏర్పాటు చేశారు. తిరిగి 14వ తేదీన అయోధ్యలో తిరుగు ప్రయాణం ప్రారంభమంవుతుంది.

indian railway arrangement special trains from ap to ayodhya dham

గుంటూరు నుంచి మరో రైలు రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి మీదగా ప్రయాణించనుంది. 7వ తేదీన గుంటూరులో ప్రారంభమై అయోధ్యకు చేరుతుంది. తిరిగి 10వ తేదీన అయోధ్య నుంచి గుంటూరుకు బయలుదేరుతుంది. రైళ్లు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లి అయోధ్య రామ్ లల్లాను దర్శించుకునే భాగ్యం కల్పిస్తున్న భారతీయ రైల్వేకు శ్రీరాముడి భక్తులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రిజర్వేషన్ లేకపోయినప్పటికీ సాధారణ బోగీల్లో అయినా ప్రయాణం చేసి రాముడిని దర్శించుకొని తరిస్తామని తన్మయత్వంతో చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+