రైల్వే గుడ్ న్యూస్: టికెట్ కన్ఫర్మ్ అయ్యాకే డబ్బులు చెల్లించండి
ప్రస్తుతం చాలామంది రైలు టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లి బుక్ చేసుకునేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. దాదాపు 100కు 80 మంది ఐఆర్సీటీసీ యాప్ వాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు. కానీ డబ్బులు మాత్రం కట్ అవుతాయి. అవి వెనక్కి రావాలంటే మూడు నుంచి ఐదురోజుల సమయం పడుతోంది. అలా కాకుండా ఇకనుంచి టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ కన్ ఫర్మ్ అయితేనే డబ్బులు కట్ అయ్యేవిధంగా కొత్త విధానాన్ని భారతీయ రైల్వే తెచ్చింది.
ఐఆర్ సీటీసీ ఐపే పేమెంట్ గేట్ వేలో బుక్ చేయాలి: ముందుగా డబ్బులు చెల్లించకుండానే ఈ-టికెట్లను బుక్ చేసుకునే వ్యవస్థను రైల్వే తీసుకొచ్చింది. ఐఆర్సీటీసీ యాప్ ద్వారా ఐ-పే పేమెంట్ గేట్ వే అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆటోపే అంటారు. యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో పనిచేస్తుంది. టికెట్ కోసం పీఎన్ ఆర్ రూపొందించినప్పుడే వినియోగదారుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఈ విధానంవల్ల వెయిటింగ్ లిస్ట్, జనరల్ లేదా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

'బెర్త్ ఛాయిస్ నాట్ మెట్' లేదంటే 'నో రూమ్' అని వచ్చినప్పుడు టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఛార్ట్ సిద్ధమైన తర్వాత కూడా తత్కాల్ ఈ టికెట్ వెయిట్ లిస్టులో ఉంటే క్యాన్సిలేషన్ చార్జ్, ఐఆర్ సీటీసీ కన్వీనియన్స్ ఫీజు, మాండేట్ ఛార్జ్ వంటివి మాత్రమే కట్ అవుతాయి.
ఎనేబుల్ చేసుకునే విధానం
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ కి వెళ్లి ప్రయాణీకుల వివరాలను నమోదు చేసి ఎంచుకున్న బెర్త్ కోసం బటన్ నొక్కాలి. 'ఐపే' అని పిలిచే చెల్లింపు గేట్‌వేపై క్లిక్ చేస్తే వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆటోపే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐఆర్సీటీసీ క్యాష్, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్లలో ఆటోపే ఎంచుకోవాలి. డబ్బులు కట్ అవడానికి యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల్లో ఒకదానిపై క్లిక్ చేయాలి. ప్రయాణం నిర్థారించి టికెట్ బుక్ అయితేనే ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. లేదంటే ఎలాంటి కటింగ్స్ ఉండవు.












Click it and Unblock the Notifications