రైల్వే గుడ్ న్యూస్.. 'జనతా ఎక్స్ ప్రెస్' రాబోతోంది!
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, కార్మికులు, పేదలు, కూలీల కోసం ప్రత్యేకంగా రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ రైళ్లల్లో 22 నుంచి 26 బోగీలు ఉండబోతున్నాయి. వీటిని జనతా ఎక్స్ ప్రెస్ గా పిలవనున్నారు. పేదలకు తక్కువ ఛార్జీలతో మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే వీటి ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. 2024 నాటికి వీటిని ప్రారంభించబోతున్నారు.
సాధారణ రైళ్ల కంటే ఈ రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అస్సాం, గుజరాత్, ఢిల్లీ మధ్య వీటిని నడపనున్నారు. ఈ రాష్ట్రాల్లో కార్మికులు ఎక్కువగా ఉండటం, వలసలు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇందులో ప్రయాణించేవారికి తక్కువ ధరల్లో నాణ్యమైన భోజనాన్ని అందుబాటులోకి తేబోతున్నారు. స్లీపర్, జనరల్ బోగీలు మాత్రమే జనతా ఎక్స్ ప్రెస్ లో ఉండబోతున్నాయి.

రైళ్లల్లోని జనరల్ బోగీల్లో ప్రయాణించేవారిని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే 'ఎకానమీ మీల్స్' పేరుతో కొత్త పథకాన్ని అమలు చేస్తోంది 7 పూరీలతో పాటు ఆలు కూర, పచ్చడిని కలిపి 20 రూపాయలకే అందిస్తారు. రెండో కేటగిరీలో అన్నం, రాజ్‌మా, ఛోలే, కిచిడీ కుల్చే, భతురే, పావ్‌భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చు. దీని ధర రూ.50. 200 మిల్లీలీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ గ్లాసులను సైతం ఆయా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచుతారు. రూర్కీ, జార్సుగుడ, ఖుర్దా రోడ్డు స్టేషన్లలో ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్లు స్టేషన్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తర్వాత ఈ సేవలను అన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించనున్నారు.












Click it and Unblock the Notifications