వందేభారత్ పై ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా మినీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ వీటిని ఏర్పాటు చేశారు. ఇకనుంచి ఈ రైళ్లల్లో లీటరు మంచినీళ్ల సీసాలు కనిపించవు. ఇకనుంచి లీటరు సీసాలను కాకుండా అరలీటరు సీసాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. నీటివృథాను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వందేభారత్ తోపాటు శతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో కూడా లీటరు సీసాల స్థానంలో అరలీటరు సీసాలు దర్శనమివ్వబోతున్నాయి. కొన్ని పరిమిత స్టేషన్లలో మాత్రమే వందేభారత్ రైళ్లు ఆగుతాయి. బయట నుంచి ఆహారం కొనుగోలు చేయాలంటే ప్రయాణికులకు బాగా ఇబ్బందిగా ఉంటోంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు ఆహార పదార్థాలకు సంబంధించి ఆర్డర్ పెట్టుకునే సదుపాయాన్ని కల్పించారు. సీటు వద్దకే భోజనం వస్తుంది. భోజనంతోపాటు లీటరు సీసాలు అందిస్తుంటే కొందరు సగం తాగి వదిలేస్తున్నారు.

Indian Railways offers meals at Economical price for passengers during summer season

దాదాపుగా అందరూ ఇలానే చేస్తుండటంతో నీటి వృథాను అరికట్టేందుకు ఇకనుంచి అరలీటరు సీసాలు ఇవ్వాలని నిర్ణయించారు. సగం తాగిన తర్వాత నీటిని అలాగే వదిలేస్తుండటంతో నీరు వృథాతోపాటు సీసాలను కూడా తిరిగి వాడే అవకాశం ఉంది. అందుకే అరలీటరు సీసాలివ్వడంతోపాటు తాగిన తర్వాత వాటిని క్రష్ చేసి పారేయాలని సూచిస్తున్నారు. అయితే వందే భారత్ రైళ్లల్లో టికెట్ తోపాటు బుక్ చేసుకున్న ఫుడ్ ధర ఎక్కువగా ఉంటోందని విమర్శలు వస్తున్నాయి. టికెట్ ధరలే ఎక్కువగా ఉంటుంటే వాటికితోడుగా ఫుడ్ ధరలు కూడా భారీగా ఉన్నాయని, వాటిని వెంటనే తగ్గించాలని రైల్వే యూజర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+