ఏపీ రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచన
ఏపీలోని రైలు ప్రయాణికులు భారతీయ రైల్వే కీలక సూచన జారీచేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని విజయవాడ-చెన్నై మధ్య మూడో రైల్వే లైను పనులు జరుగుతుండటంతో బిట్రగుంట- విజయవాడ మధ్య నడిచే (07977, 07978) మెము రైళ్లను ఫిబ్రవరి నెలాఖరులోనే రద్దుచేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అవి పట్టాలెక్కవని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు బిట్రగుంట- చెన్నై మధ్య నడిచే(17237, 17238) మెము రైళ్ల ను కూడా 31వ తేదీ వరకు రద్దుచేశారు.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రోలింగ్ కారిడార్ పనులు జరుగుతుండటమే కారణమని అధికారులు తెలిపారు. నెల్లూరు, గూడూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వైద్యసేవల కోసం చెన్నై వెళ్లే ప్రయాణికులకు కూడా ఇక్కట్లు తప్పడంలేదు. వీటిని వెంటనే నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రైళ్ల రద్దు అంటే కేవలం మూడు నుంచి నాలుగు రోజులుంటాయని.. అంతేకానీ రోజుల తరబడి.. వారాలా తరబడి రద్దుచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.

ఈనెల 31 తర్వాతైనా నడిపిస్తారా? అలాగే రద్దును కొనసాగిస్తారా? అని నిలదీస్తున్నారు. ఆరునెలల నుంచి ఇదే తంతు అని, బిట్రగుంట రైల్వేస్టేషన్ మేనేజర్ కు రైల్వే అభివృద్ధి కమిటీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతోపాటు ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న రైళ్లు సరిపోక అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైలు పట్టాలపై ట్రాఫిక్ ఎక్కువవుతోంది. కొన్ని స్టేషన్ల లోపలికి రావడానికి గంటల తరబడి ఆలస్యం జరుగుతుండటంతో రద్దీని నివారించేందుకు చెన్నై-విజయవాడ మధ్య మూడో లైను నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది అందుబాటులోకి వస్తేకానీ రైళ్ల రద్దు ఆగదని అంటున్నారు.












Click it and Unblock the Notifications