దుర్గగుడి దసరా ఆర్జిత సేవల టికెట్ల విడుదల- బుకింగ్ ఇలా..!!
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబు అవుతోంది. ఆలయ అధికారులు.. పాలక వర్గం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో.. ఈ సారి దసరా ఆర్జిత సేవల టికెట్లను ఈ రోజు (సోమవారం) విడుదల చేసారు. ఇంద్రకీలాద్రి పై ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే దసరా ఉత్సవా ల్లో 16వ తేదీ మినహా ఆర్జిత సేవల్లో పాల్గొనాలనే భక్తులకు టికెట్లు అందుబాటులోకి తెచ్చారు.
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆర్జిత సేవలైన ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం, ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవావరణార్చన సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో దేవస్థానం వెబ్ సైట్, మన మిత్ర వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా టికెట్లను పొందేలా అవకాశం కల్పించినట్లు ఆలయ పాలక వర్గం ప్రకటించింది. మన మిత్ర వాట్సప్ లో సేవల టికెట్లు సాయంత్రం నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 16న మూలా నక్షత్రం రోజున అన్ని ఆర్జిత సేవలను భక్తులకు సంబంధం లేకుండా సర్కారీ సేవ పేరుతో అర్చకులు నిర్వహిస్తారని వివరించారు. పరోక్ష పూజలు మాత్రం ఉత్సవాల్లో అన్ని రోజులు చేయించుకొనేలా అవకాశం ఉందని తెలిపారు.

భక్తులకు కీలక సూచనలు
కాగా, ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లో కుమ్మరిపాలెం సెంటర్ లో టీటీడీ స్థలం నుంచి ఇంద్రకీలాద్రికి చేరవచ్చని వెల్లడించారు. దూరప్రాంతాల్లో ఉండి ఆలయానికి నేరుగా వచ్చి ఈ సేవల్లో పాల్గొనలేని భక్తులకు కూడా అవకాశం కల్పించారు. ఇంటి నుంచే పరోక్షంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను వీక్షించే సదుపాయం అందుబాటులో ఉంటుంది. పూజా సమయంలో అర్చకులు అమ్మవారి సన్నిధిలో భక్తుల పేర్లు, గోత్రాలను చదివి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పరోక్ష సేవలు బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా ప్రత్యేక ప్రసాదాలను పంపిస్తారు. ఇందులో అమ్మవారి శేష వస్త్రం, రవిక ముక్క, శ్రీచక్ర పీఠం, కుంకుమ భరిణె, రక్షా కంకణాలు మరియు ల్యామినేషన్ ఫొటోలు ఉంటాయి.












Click it and Unblock the Notifications
