అమ్మ దర్శనానికి అగచాట్లు! క్యూలైన్లలో భక్తుల నరకయాతన, జర్నలిస్టుల ధర్నా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజైన ఆదివారం రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 12 గంటల సమయానికి దాదాపు 34,762 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు దసరా ఉత్సవాల్లో అధికారుల నిర్వహణ లోపాలు తొలిరోజే బయటపడటంతో సామాన్య భక్తులకు తిప్పలు తప్పడం లేదు. భక్తులందరికీ సౌకర్యవంతంగా ఉండేలా మూడు క్యూలైన్లలో ఉచిత దర్శనం కల్పిస్తున్నామని ఆలయ అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఉదయం 5 గంటలకే క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులు ఉదయం 9 గంటలు దాటినా ఘాట్ రోడ్డు వద్దకే చేరుకోలేకపోయారు. నాలుగు గంటలకు పైగా లైన్లలోనే నిలబడాల్సి రావడంతో విశాఖపట్నం జిల్లా పెందుర్తి వంటి దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీఐపీలకే పెద్దపీట: వృద్ధులను పట్టించుకోని వైనం
సామాన్య భక్తులు గంటల తరబడి.. మండుటెండలో క్యూలైన్లలో పడిగాపులు కాస్తుంటే.. అధికార యంత్రాంగం, పోలీసులు మాత్రం వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్యూలైన్లు ముందుకు కదలకుండా నిలిచిపోవడంతో వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులు నిలబడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితిని చూసైనా క్యూలైన్లను వేగంగా కదిలించాల్సిన అధికారులు, పోలీసులు ఏమాత్రం కనికరం చూపడం లేదని ఆలయానికి వచ్చిన పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగేందుకు నీళ్లే దిక్కు..
గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు కనీస ప్రాథమిక వసతులు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. క్యూలైన్లలో ఉన్న వారికి కేవలం మంచి నీళ్లు మాత్రమే అందిస్తున్నారని, ఉదయాన్నే వచ్చిన వృద్ధులకు, పిల్లలకు పాలు, మజ్జిగ లేదా బిస్కెట్లు వంటి ఉపశమన పదార్థాలు ఏవీ ఇవ్వడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. తీవ్రమైన రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణను మెరుగుపరచడంతో పాటు, వృద్ధులకు ప్రత్యేక సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మీడియా కవరేజ్‌పై ఆంక్షలు: అధికారుల తీరుపై భక్తుల మండిపాటు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల కవరేజ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులను ఆలయ అధికారులు అడ్డుకోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొండపై నెలకొన్న వాస్తవ పరిస్థితులు, భక్తుల ఇబ్బందులు బయటకు రాకుండా ఉండేందుకే అధికారులు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని జర్నలిస్టులు ధర్నాకు దిగారు. మీడియా పాసుల జారీ, కవరేజ్ డ్యూటీకి అంక్షల నేపథ్యంలో నిరసన తెలియజేశారు.
విజయవాడ:దసరా ఉత్సవాల తొలిరోజే భక్తులకు మొదలైన అవస్థలు.మూడు లైన్లలో ఉచిత దర్శనం అంటూ డబ్బాలు కొట్టిన అధికారులు.వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకు పెద్దపీట.గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడుతున్న భక్తులు.ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తుల ఆగ్రహం.#CBNJungleRaj #SaveTemplesFromTDP #AndhraPradesh #JaganannaConnects
— Jagananna Connects (@JaganannaCNCTS) October 11, 2026












Click it and Unblock the Notifications
