ఇంద్రకీలాద్రి లో ఇక తిరుమల తరహాలో, కీలక నిర్ణయాలు..!!
విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు బిగ్ అప్డేట్. ఆలయంలో భక్తులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు అందించే అమ్మవారి ప్రసాదంతో పాటుగా అన్నదానం పైన స్పెషల్ ఫోకస్ చేసారు. ఇందు కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను ఇక్కడా కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఆలయంలో అన్ని సేవలు డిజిటల్ పద్దతిన భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల కోసం కొత్త నిర్ణయాలు అమల్లోకి తీసుకొస్తున్నారు. అమ్మవారి ప్రసాదం.. భక్తులకు అందించే అన్నదానం నాణ్యత పైన ఆలయ అధికారులు ఫోకస్ చేసారు. కొత్తగా అన్నదానం, ప్రసాదాల తయారీ భవనాలను నిర్మిస్తున్నారు. రానున్న దసరా నాటికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రత్యేకగా
తిరుమల కొండపై లడ్డూ ప్రసాదం తయారీని అక్కడికి వెళ్లిన బృందం క్షుణ్నంగా పరిశీలించింది. వినియోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, తయారీ విధానం పరిశీలన చేసారు. అక్కడ వినియోగి స్తున్న ముడి పదార్థాల నాణ్యతని పరిశీలించింది. ఉత్తమ విధానాలు అన్నింటినీ అడిగి తెలుసు కున్నారు. తిరుమల ఇంజినీరింగ్ అధికారులు అక్కడి అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని విజయవాడ బృందానికి అందజేశారు. దుర్గగుడి ప్రాంగణంలో ఇప్పటికే ప్రసాదాల తయారీతో పాటు అన్నదాన భవనాలను 80 శాతానికి పైగా పూర్తి చేసారు.

భక్తుల కోసం కొత్త నిర్ణయాలు
తిరుపతిలో ఉన్న విధానాలను ఎలా ఇంద్రకీలాద్రిలో అమలు చేయాలనే అంశంపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజాగా జరిగిన సమీక్షలో ప్రసాదం..అన్నదానం పైన ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఆలయంలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రక్షాళన చర్యలను అమలు చేస్తున్నారు. కనకదుర్గగుడిలో ఇకపై సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారుస్తున్నారు. భక్తులకు క్యూలైన్లలో నిలబడే ఇబ్బంది ఇక ఉండదు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వసతి గదుల కోసం కూడా డిజిటల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చివరకు కేశఖండన టికెట్లు, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా డిజిటల్ చెల్లింపులు అందు బాటు లోకి తీసుకురానున్నారు. దీంతో.. ఇక రద్దీ సమయంలోనూ భక్తులు ముందస్తు దర్శనం రిజర్వేషన్ ద్వారా సులభంగా దర్శనం పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications