సీఎం జగన్ నాయకత్వంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త కీలక వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త కీలక వ్యాఖ్యలు చేసారు. ఇతర సీఎంల్లోనే చర్చ జరుగుతందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ జగన్ నాయకత్వంపై చర్చ జరుగుతోందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ లేని లోటు ఎవరూ పూడ్చలేనదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. ప్రాధాన్యత ఇస్తున్న రంగాల గురించి చెప్పుకొచ్చారు.
కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో జీఎస్ డబ్ల్యూ స్టీల్స్ కు భూమి పూజ జరిగింది. ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా జిందాల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఇందులో పాల్గొన్నారు. జిందాల్ కొత్త పరిశ్రమ కడప జిల్లాలో ఏర్పాటు చేయటం పైన సంతోషం వ్యక్తం చేసారు. తనకు వైఎస్సార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. నాడు వైఎస్ తనతో స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటు గురించి చర్చించారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జగన్ నాయకత్వం గురించి జిందాల్ వివరించారు. నిబద్దత..అకుంఠిత దీక్షతో జగన్ పాలన కొనసాగిస్తున్నారని అభినందించారు. వైద్య..మౌళిక వసతులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించారు. పోర్టుల ఆధునీకరణ.. ఇతర రంగాల్లో ప్రభుత్వం- ప్రయివేటు రంగాల సహకారంతో ముందుకు వెళ్తున్నారని వివరించారు.

ఈ రోజు భూమి పూజ చేస్తున్న స్టీల్ ఫ్యాక్టరీ 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్తామని జిందాల్ ప్రకటించారు. ఈ రోజు జరిగిన భూమి పూజ..వేసిన పునాది మొత్తంగా కడప జిల్లా అభివృద్ధి గా పేర్కొన్నారు. నాడు సీమలో భాగంగా ఉన్న బళ్లారిలోనూ జిందాల్ పరిశ్రమ పెట్టిన తరువాత ఇదే జరిగిందని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో వచ్చిన మార్పులను వివరించారు.
దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు చూపు ఏపీ వైపు ఉంది. అందుకు ఇక్కడి లీడర్ షిప్, నిజాయితీతో కూడిన పాలనే ముఖ్య కారణం.
— YSR Congress Party (@YSRCParty) February 15, 2023
వైయస్ జగన్ ఒక పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అన్న రీతిలో వైయస్ జగన్ పాలన గురించి దేశమంతా చర్చించుకుంటోంది- సజ్జన్ జిందాల్ #KadapaSteelPlant #CMYSJagan pic.twitter.com/oI1ZLeqL3D

అక్కడ కూడా ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కడప జిల్లాలోనూ రానున్న రోజుల్లో అనూహ్య అభివృద్ధికి అవకాశం ఉందని సజ్జన్ జిందాల్ ఆశాభావం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ సైతం ఈ రోజు ఒక మంచి వ్యక్తి చేతిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఏ అవసరం వచ్చినా తాను ఒక్క ఫోన్ కాలం దూరంలోనే ఉన్నానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications