మీ యాక్షన్ చూపిస్తే నేనూ వస్తా!: చంద్రబాబుకు చిరంజీవి ఆఫర్
విశాఖ: చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఓ విజ్ఞప్తి చేశారు. ఏపీలోని విశాఖలో సినిమా పరిశ్రమ పెంపొందించేందుకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. నాడు చెన్నై నుంచి హైదరాబాదుకు సినిమా పరిశ్రమ వచ్చినప్పుడు నాటి ఏపీ ప్రభుత్వం భూమి, స్టూడియో తదితర అన్ని సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. అలాగే ఇప్పుడు విశాఖలో అదే విధంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు.

మంత్రి గంటా శ్రీనివాస రావు ద్వారా తాను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని, విశాఖలో సినిమా స్టూడియోలకు భూములను గుర్తించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని తాను కోరుతున్నానని చెప్పారు. విశాఖలో చిత్రపురి కాలనీని నిర్మించాలని సూచించారు.
చంద్రబాబు సినిమా పరిశ్రమ అభివృద్ధికి దృష్టి సారిస్తే నేను కూడా విశాఖకు వస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సినిమా పరిశ్రమ కళకళలాడాలని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. నేను రిటైర్ అయ్యాక విశాఖలోనే నివాసం ఏర్పర్చుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.
-
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..!












Click it and Unblock the Notifications