Infosys: విశాఖలో ఆఫీస్‍ను ప్రారంభించిన ఇన్ఫోసిస్..
భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖలో కార్యకాలాపాలు ప్రారంభించింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్ నం.2లో ఇన్ఫోసిస్ కార్యకాలాపాల కోసం భారీ భవనాన్ని నిర్మించారు. ఇందులనే ఇన్ఫోసిస్ బుధువారం కార్యకలాపాలు మొదలు పెట్టింది. గతంలో శాటిలైట్ ఆఫీస్ పెడతామని ప్రకటించిన ఇన్ఫోసిస్.. దాన్ని ఇప్పుడు డెవలప్‌మెంట్ సెంటర్‌గా అభివృద్ధి చేసి ప్రారంభించింది.
కంపెనీ 2022 అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే దాని కార్యాలయం స్థానం సరైన సమయంలో ఖరారు కానందున ఆలస్యమైంది. చివరకు రుషికొండలోని ఐటీ సెజ్‌లో సరైన సమయంలో బ్రాంచ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇన్ఫోసిస్ తొలివిడతలో 650 మంది సామర్థ్యంతో సేవలు అందించనుంది. ఈ సంఖ్య త్వరలోనే 1000 మంది చేరే అవకాశం ఉంది.

విశాఖ పక్కల జిల్లాల్లో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇప్పుడు విశాఖలో పని చేయనున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీని విస్తరించాలన్న ఉద్దేశంతో ఇన్ఫోసిస్ నాగపూర్, కోయంబత్తూర్, విశాపట్నం, భోపాల్ లో కార్యాలయాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కృషితో దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.
ముఖ్యంగా విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ప్రారంభంతో సాగర నగరానికి కొత్త కళ సంతరించుకుంది. రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన సాగించనున్నట్లు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో విశాఖపట్నం ప్రముఖ నగరంగా ఆవతరించే అవకాశం ఉంది.
విప్రో, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మే 3వ తేదీన విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేయడంతో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications