విశాఖలో ఇన్ఫోసిస్ - ప్లగ్ అండ్ ప్లే విధానంలో : ముహూర్తం ఫిక్స్..!!
విశాఖ నగరం కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యాలయం అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. టైర్-2 నగరాల్లో కార్యలయాలు ప్రారంభించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖ నగరాన్ని సైతం ఎంపిక చేసింది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో తొలి కార్యాలయం ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. 750-800 మంది ఉద్యోగులు పనిచేసేందుకు అనువుగా ఉండేలా విశాఖలో ఓ ప్రైవేట్ భవనంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.
ఉభయ గోదావరి..ఉత్తరాంధ్ర కు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు విశాఖ నుంచే పనిచేసే అవకాశం కలగనుంది. ఇన్ఫోసిస్ సంస్థ దేశంలో ఇప్పటి వరకు సొంత నిర్మాణాల్లోనే సేవలు అందిస్తుండగా.. తాజాగా నాలుగు ప్రాంతాల్లో తొలిదశలో ప్లగ్ అండ్ ప్లే ద్వారా సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖలో తొలి ప్లగ్ అండ్ ప్లే కార్యాలం విశాఖలో ప్రారంభిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ.. భవిష్యత్తులో సంస్థ సేవలు విస్తరించాలని నిర్ణయించారు.

ఇన్ఫోసిస్ సంస్థకు స్థల కేటాయింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. ఆగస్టు నుంచే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇన్ఫోసిస్ ముందుగా కార్యకలాపాలు ప్రారంభించటం ద్వారా భవిష్యత్ రోజుల్లో ఎంఎన్సీ సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా విశాఖ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications