కొత్త కోణం: మహిళతో కలిసి వచ్చి 'ఇంజెక్షన్ సైకో' సూది గుచ్చాడు
రాజమండ్రి: ఇంజెక్షన్ సైకో మరోసారి కలకలం రేపాడు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూదిగాడు ఓ తాపి మేస్త్రీకి సూది గుచ్చి పారిపోయాడు. బాధితుడి పేరు శ్రీనివాస్. సూదిగాడి వెంట ఓ మహిళ ఉన్నట్లుగా అతను చెబుతున్నాడు.
సూదిగాడి వెంట మహిళ ఉండటం అనేది కొత్త ట్విస్ట్. తాపి మేస్త్రి శ్రీనివాస్ తన ద్విచక్ర వాహనం పైన వెళ్తున్నాడు. ఆ సమయంలో సూదిగాడు వచ్చి అతనికి సూది గుచ్చి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. 108 వాహనంలో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. సూదిగాడి వెంట ఓ మహిళ ఉన్నట్లు బాధితుడు కొత్త విషయం చెప్పాడు. బాధితుడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. సూదిగాడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
చిన్నారులపై వీధి కుక్కల దాడి
కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో వీధి కుక్కలు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారుల పైన దాడి చేశాయి. దీనిని గుర్తించిన స్థానికులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలలుగా కుక్కలు విజృంభిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications