గస్తీ మరింత ఈజీ: ఐఎన్ఎస్ అనిర్వేష్ ప్రత్యేకతలివే
విశాఖపట్నం: తీర ప్రాంతంలో రక్షణ మరింత బలోపేతం అయింది. తూర్పు నౌకాదళ కోస్టు గార్డు అమ్ములపోదిలో మరో అత్యాధునిక గస్తీ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ఐఎన్ఎస్ అనిర్వేష్' సోమవారం జలప్రవేశం చేసింది. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ సోమవారం నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
అనంతరం బిస్త్ గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ నుంచి కొత్త నౌక సేవలు అందించనుంది. 50 మీటర్ల పొడవు, 317 టన్నుల బరువున్న ఈ వెసల్‌ను కొచ్చిన షిప్‌యార్డ్‌లో రూపొందించారు. సముద్ర జలాలపై గస్తీ కోసం అత్యాధునిక సాంకేతిక స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో రాత్రి పూట కూడా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేందుకు అత్యాధునికి నైట్ విజన్ వ్యవస్ధను ఏర్పాటు చేశారు.
ఈ నౌక ముందు భాగంలో 40/60 బోఫోర్స్ గన్‌ను అమర్చారు. ఈ నౌకలో ఆరుగురు అధికారులతో 34 మంది నౌకదళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఈ కార్యక్రమంలో కోస్టుగార్డు తూర్పు ఐజీ శర్మ, ఏపీ కమాండర్ ఏకే హరబోలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోస్టుగార్డు తూర్పుతీర ఐజీ ఎస్సీ శర్మ మాట్లాడుతూ ఏపీ తీర ప్రాంతానికి మరింత భద్రత కల్పించనున్నట్టు వెల్లడించారు.
కోస్తా రక్షణకు ప్రస్తుతానికి 11 గస్తీ నౌకలు, ఎయిర్‌క్రాప్ట్‌లు, హెలికాప్టర్లు ఉన్నాయని తెలిపారు. త్వరలో మరో నాలుగు గస్తీ నౌకలు సమీకరించనున్నట్టు పేర్కొన్నారు. మచిలీపట్నంలో జట్టీ నిర్మాణానికి ప్రతిపాదించామన్నారు. విశాఖలో ఎయిర్‌క్రాప్ట్ ల్యాండింగ్ బేస్‌కు ఐదెకరాలు అవసరమని దీనికోసం నేవీ, విశాఖ పోర్టు, ఎయిర్‌పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

గస్తీ మరింత ఈజీ: ఐఎన్ఎస్ అనిర్వేష్ ప్రత్యేకతలివే
విశాఖలో జల ప్రవేశం చేసిన ఐఎన్ఎస్ అనిర్వేష్

Click it and Unblock the Notifications