బీజేపీపై తిరుగుబాటు: ఆర్కే బీచ్.. పవన్ కళ్యాణ్ చేతుల్లోకి, జగన్‌కు అది మైనస్!
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ పైన అంచెలంచెలుగా తిరగబడుతున్నారు! ప్రత్యేక హోదా అంశంతోనే తాను బీజేపీకి 2014 ఎన్నికల్లో మద్దతిచ్చానని ఆయన గతంలో చెప్పారు.
విజయనగరం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ పైన అంచెలంచెలుగా తిరగబడుతున్నారు! ప్రత్యేక హోదా అంశంతోనే తాను బీజేపీకి 2014 ఎన్నికల్లో మద్దతిచ్చానని ఆయన గతంలో చెప్పారు.
ఆయన రావాలి: రామచంద్రయ్య, మరి ఎలా.. నాశనం చెయ్యడమే: పవన్ కళ్యాణ్
అదే హోదా పైన ఇప్పుడు బీజేపీ వెనక్కి తగ్గడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం వరుసగా తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో సభలు నిర్వహించారు. బీజేపీ పైన దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇప్పటికే, ఆర్కే బీచ్‌లో లేదా ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమయ్యే ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే చర్చ సాగుతోంది. ఇప్పటుకే ఆర్కే బీచ్‌లో నిరసనకు మద్దతుగా పవన్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. జగన్ అయితే ఏకంగా తాను వస్తానని ప్రకటించారు. ఆ తర్వాత హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ ముందుకు తెచ్చారు.

మెరీనా దారిలో ఆర్కే
తాజాగా, జల్లికట్టు ఉద్యమం ఏపీ ప్రత్యేక ఉద్యమానికి ఊతమిచ్చింది. మెరీనా బీచ్‌లో జల్లికట్టు కోసం తమిళ యువత శాంతియుతంగా ఉద్యమించింది. వారం రోజుల తర్వాత అది హింసాయుతంగా మారిందనేది వేరే అంశం.

వారికి పవన్, పవన్‌కు జగన్ తోడు
మెరీనా బీచ్‌లో జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా చేసుకొని విశాఖలోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా ఉద్యమానికి ఏపీ యువత సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో వారికి పవన్, ఆ తర్వాత జగన్ మద్దతు పలికారు.

యువనటుల మద్దతు
ఈ నెల 26వ తేదీన ఆర్కే బీచ్‌లో ప్రారంభించనున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి నటులు కూడా తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశముంది. సంపూర్ణేష్ బాబు ఇప్పటికే తాను టిక్కెట్ కూడా తీసుకున్నానని, అది కన్‌ఫర్మ అయిందని ట్వీట్ చేశారు. యువనటులు పలువురు మద్దతు పలికారు.

ఆర్కే బీచ్... పవన్ లీడ్ చేస్తారా?
జల్లికట్టు కోసం మెరీనా బీచ్‌లో జరిగిన నిరసనలో పెద్ద ఎత్తున యువత, తమిళులు పాల్గొన్నారు. మరోవైపు, ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేనందున.. ఆర్కే బీచ్‌లో నిరసన అనంతరం ఉద్యమం కొనసాగే అవకాశముంది. దీనిని పవన్ కళ్యాణ్ చేతుల్లోకి తీసుకుంటారా అనే చర్చ సాగుతోంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేతికి వెళ్లే అవకాశాలు మాత్రం లేవంటున్నారు. జగన్ రాజకీయ అవసరాలకు, పవన్ చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్నారని ఇప్పటికే పలువురు పేర్కొంటున్నారు.

జగన్ రాజకీయంగా ఏకాకి, పవన్‌కు అందరి మద్దతు..
మరో విషయం ఏమంటే.. జగన్ ఉద్యమిస్తే.. కేవలం వైసిపి మద్దతు మాత్రమే కనిపిస్తోందని అంటున్నారు. హోదా ఉద్యమంలో పవన్‌కే ఎక్కువ మద్దతు కనిపిస్తోందని అంటున్నారు. ఆయనకు తన జనసేన పార్టీతో పాటు యువత మద్దతు ఎక్కువగా ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పవన్‌కే ఓటు వేస్తుందని అంటున్నారు. పవన్ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేనప్పుడు టిడిపి మద్దతివ్వాల్సిందే అంటున్నారు.

జల్లికట్టు నుంచి పదేపదే టార్గెట్
జల్లికట్టు ఉద్యమం అనంతరం పవన్ కళ్యాణ్ పదేపదే కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం యువత పోరాడితే అండగా నిలబడతామని ఓ రోజు, హోదా కోసం తిరగబడతామని మరుసటి రోజు, తాజాగా.. మంగళవారం నాడు అవకాశవాద, వేర్పాటువాద, క్రిమినల్ పాలిటిక్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ... దేశ్ బచావో అని ట్వీట్ చేశారు.

మిగతా నటుల్లా కాకుండా..
జల్లికట్టు విషయంలో మిగతా నటుల్లా కాకుండా పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. నడిగర సంఘం జల్లికట్టుకు మద్దతు పలికింది. పోలీసులపై నటులు నిప్పులు చెరిగారు. కానీ పవన్ ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు కదా అని నిలదీశారు. అంతేకాదు, ద్రవిడ సంస్కృతిని గౌరవించాలని కేంద్రంపై నిప్పులు చెరిగారు. దక్షిణాదిని అణిచి వేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications