పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ బిగ్ అలర్ట్..!!
ఏపీలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసి వారం అయినా పార్టీల్లో టెన్షన్ తగ్గలేదు. పోలింగ్ సరళి తరువాత గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ, ఓటరు నాడి పైన స్పష్టత మాత్రం పలు నియోజకవర్గాల్లో రాలేదని తెలుస్తోంది. పోలింగ్ రోజు...ఆ తరువాత రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ఆందోళనకు కారణమయ్యాయి. ఇప్పుడు కౌంటింగ్ సమయంలో నిఘా సంస్థ లు తాజాగా అలర్ట్స్ ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్రంలో పోలింగ్ పూర్తి కాకుండానే పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తో సహా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. వీటి పైన రాజకీయంగానూ ఆరోపణలు వచ్చాయి. దీని పైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నేరుగా డీజీపీ, సీఎస్ ను ఢిల్లీకి రప్పించి వివరణ తీసుకుంది. ఘటనల పై విచారణకు సిట్ ఏర్పాటు చేసారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల పైన కఠిన చర్యలు తీసుకుంది. సిట్ టీం ఘర్షణలు జరిగిన ప్రాంతంలో విచారించి నివేదిక సిద్దం చేసింది. ఈ రోజు డీజీపీ ద్వారా ఈసీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనుంది.

ఇదే సమయంలో మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురంపై ఉన్నతాధికారులకు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కౌంటింగ్ కు ముందు, తర్వాత కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో.. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని రిపోర్ట లో పేర్కొన్నట్లు చెబుతున్నారు. కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై పోలీసుల ఫోకస్ చేస్తున్నారు. గతంలో కాకినాడ ప్రాంతంలో రెండు పార్టీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు..ఉద్రిక్తతలను పరిగణ లోకి తీసుకున్న అధికారులుజ...కౌటింగ్ నాడు మరోసారి అటువంటివి చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications