ఫలితాల వేళ అమరావతి కేంద్రంగా అనూహ్య నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఏపీలో ఎన్నో అంశాల పైన క్లారిటీ ఇవ్వనున్నాయి. గెలుపు పైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. అయిదేళ్ల కాలంగా కొనసాగుతున్న రాజధాని వివాదంకు ముగింపు లభించే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా పలితాల ముందు ఆసక్తి కర అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి.

కీలక పరిణామం
అమరావతిలో అయిదేళ్లుగా సాగుతన్న పరిణామాలకు భిన్నంగా కీలక అంశం చోటు చేసుకుంది. రాజధాని ప్రాంతం నుంచి నిర్మాణ సామగ్రి తరలింపు వ్యవహారంపై ఎట్టకేలకు సీఆర్డీఏ స్పందించింది. అమరావతి నుంచి తరలిస్తున్న సామగ్రిని సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. అమరావతిలోని తాళ్లాయిపాలెం గ్రామంలో ఉన్న ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన స్టాక్​ యార్డ్ నుంచి తరలిస్తున్న భూగర్భ విద్యుత్తు కేబుళ్లకు అమర్చేందేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ స్పేసర్​లను సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు.

Interesting development in Amaravati capital area ahead AP Assembly Election Results

సీఆర్డీఏ నిర్ణయం
ఎల్ అండ్ టీ స్టాక్ యార్డ్​లో సీఆర్డీఏ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సదరు కంటైనర్ వాహనంలో ప్లాస్టిక్ స్పేసర్స్ తరలింపును గుర్తించిన అధికారులు వాటిని అడ్డుకున్నారు. సీఆర్డీఏకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సామగ్రిని తరలించడం పట్ల సంబంధిత గుత్తేదారు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు సీఆర్డీఏ తెలిపింది. ఇకపై అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు ఉద్దేశించిన సామగ్రి తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని గుత్తేదారు సంస్థలకు సీఅర్డీఏ స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి సామగ్రి అంతా నిరుపయోగంగా ఉంది.

Interesting development in Amaravati capital area ahead AP Assembly Election Results

ఎన్నికల తరువాత
ఎల్‌ అండ్‌ టీ నిల్వ కేంద్రం నుంచి సామగ్రిని తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. భారీ కంటైనర్లలో రాజధాని నుంచి ఎందుకు తరలిస్తున్నారని సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నందున, అప్పటి వరకు అయినా ఆగాలని కోరారు. ప్రస్తుతానికి తరలింపును నిలిపివేయాలని ప్రాథేయపడ్డారు. అమరావతి నిర్మాణానికి ఆటంకం కలిగించొద్దని వేడుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం తీసుకు వచ్చిన సామగ్రిని గుత్తేదారు సంస్థలు తరలింపుపై ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కొత్త ప్రభుత్వంలో రాజధాని అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+