మధ్యంతర మంత్రం.. జగన్‌కు ప్లస్సా? మైనస్సా?

తన పర్యటనల్లో తరుచుగా మధ్యంతర ఎన్నికల ప్రస్తావన తెచ్చి.. అనవసరంగా జగన్ అధికార వ్యామోహాన్ని ప్రదర్శిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

విజయవాడ: సీఎం కుర్చీ మీద వైసీపీ అధినేత జగన్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. వ్యూహ తప్పిదమో.. ప్రజల్లో అవిశ్వాసమో.. మొత్తానికి 2014ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతోనే అధికారానికి దూరమయ్యారు. అప్పటినుంచి మళ్లీ అధికార పీఠం కోసం ఆయన శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు.

మధ్యంతరంతో.. తెరపైకి ఈ ఆరోపణ..:

మధ్యంతరంతో.. తెరపైకి ఈ ఆరోపణ..:

ఈ నేపథ్యంలోనే ఆయన నోటివెంట మధ్యంతర ఎన్నికల మంత్రం తరుచూ వినిపిస్తోంది. ఉన్నపళంగా అధికారాన్ని చేజిక్కోవాలనే ఆరాటం జగన్‌కు ఉన్నా.. వాస్తవ పరిస్థితులను గమనిస్తే మాత్రం మధ్యంతర ఎన్నికల ప్రస్తావన ప్రస్తుతానికి పసలేని వ్యాఖ్యగానే మిగిలిపోతుంది. ఈమధ్య తన పర్యటనల్లో తరుచుగా మధ్యంతర ఎన్నికల ప్రస్తావన తెచ్చి.. అనవసరంగా జగన్ అధికార వ్యామోహాన్ని ప్రదర్శిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అదే బెటర్ అన్న వాదనలు :

అదే బెటర్ అన్న వాదనలు :

మధ్యంతర ఎన్నికల మీద దృష్టి పెట్టడం కన్నా.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లే మార్గాలను జగన్ అన్వేషించడం సరైందనేది పలువురి అభిప్రాయం. గురువారం నాడు కృష్ణా జిల్లా పర్యటన సందర్బంగా.. దేవుడి గట్టిగా అనుగ్రహిస్తే.. మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యం అంటూ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అపవాదు మూటగట్టుకోవడమేనా?

అపవాదు మూటగట్టుకోవడమేనా?

ఇలాంటి వ్యాఖ్యల వల్ల అధికారం కోసం జగన్ షార్ట్ కట్‌లను అన్వేషిస్తున్నారనే అపవాదు మూటగట్టుకోవడమే తప్పించి.. మరే లాభముండదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి.. ఇకనైనా మధ్యంతర ఎన్నికల గురించిన ఆలోచన పక్కనబెట్టి.. పార్టీ కార్యాచరణతో, సరైన ప్రణాళికతో ప్రజలను ఆకట్టుకోవడం లాంటి అంశాలపై జగన్ ఫోకస్ పెడితే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చునన్నది బలంగా వినిపిస్తున్న వాదన.

అదే వ్యూహం.. పవన్ పుంజుకోకముందే :

అదే వ్యూహం.. పవన్ పుంజుకోకముందే :

బయటివాళ్ల వాదనలు ఎలా ఉన్నా.. జగన్ మాత్రం మధ్యంతర మంత్రం జపించడం వెనుక పక్కా వ్యూహం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న జనసేన.. వచ్చే ఎన్నికలనాటికి మరింతగా తన ప్రాబల్యాన్ని పెంచుకునే అవకాశం ఉండడంతో.. మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చనేది జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది.

జనసేన ప్రాబల్యం పెరిగితే.. ఆ ఎఫెక్ట్ వైసీపీ ఓట్ల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో.. జనసేనకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మధ్యంతర ఎన్నికలే సరైనవి అన్న యోచనలో జగన్ ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+