ఆశ్చర్యం: సినిమాకు రూ.20 కోట్లు తీసుకునే పవన్ డబ్బులు ఇలా ఖర్చవుతున్నాయి!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వద్ద డబ్బులు లేవని ఒకటికి రెండుసార్లు చెప్పారు. పవన్ వద్ద డబ్బులు లేవని చెప్పడంపై కొందరు విమర్శలు గుప్పించారు. ప్రతి సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే పవన్ వద్ద డబ్బులు ఎందుకు ఉండవని ప్రశ్నించారు.
అయితే, దీనిపై ఓ ఆసక్తికర కథనం వచ్చింది. ఓ జాతీయ పత్రిక పవన్ గురించి ఆసక్తికర కథనాన్ని రాసింది. పవన్ తన కోసం, తన కుటుంబం కోసం భవిష్యత్ అవసరాల కోసం డబ్బును సమకూర్చుకున్నది ఏమీ లేదని పేర్కొంది.
అతడు ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాడని పేర్కొంది. పవన్‌తో ఎల్లప్పుడూ ఉండే పన్నెండు మంది ఆఫీస్ సిబ్బంది, ఫాం హౌస్‌లో పని చేసే మరో 25 మందిని ఏ లోటూ రాకుండా చూసుకుంటాడని, వారి జీతాల నిమిత్తమే అత్యధికంగా ఖర్చు చేస్తాడని వివరించింది.

అంతేకాకుండా అభిమానుల తాకిడికి గురయ్యే పవన్ కళ్యాణ్ వారి తాకిడిని తట్టుకునేందుకు 12 మంది వ్యక్తిగత సిబ్బందిని పెట్టుకున్నాడని పేర్కొంది. వీరికి ఇచ్చే వేతనాలు అదనం అని చెప్పింది. పవన్ రూ.20 కోట్లు తీసుకుంటున్నప్పటికీ ఆ డబ్బుల్లో ఇలాంటి ఖర్చు కోసమే వాడుతున్నాడని పేర్కొంది.
అలాగే, గత మూడేళ్లుగా అతు అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు మినహా చేయలేదని పేర్కొంది. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని, కాబట్టి ఎవరు ఏ కష్టంలో ఉన్నారని విన్నా వెంటనే సాయం చేస్తాడని కొనియాడింది.
అలాంటి ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఎంత ఖర్చుల్లో ఉన్నాడు, లోటులో ఉన్నాడో అర్థమవుతుందని తెలిపింది. ఇటీవల జరిగిన తిరుపతి, కాకినాడ బహిరంగ సభలకు ఎవరినీ పైసా అడగలేదని, సొంత ఖర్చులతో సభ నిర్వహిస్తున్నాడని పేర్కొంది. సమకాలీన రాజకీయ నాయకుల్లా కాకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాడని పేర్కొంది.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడనే వాదనలు ఉన్నాయని పేర్కొంది. అలాగే రేణు దేశాయ్‌తో విడిపోయిన తర్వాత వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తోందని పేర్కొంది.












Click it and Unblock the Notifications