ఇంటర్ పరీక్షల్లో కలకలం: కడపలో ఇంగ్లీష్ పేపర్ లీక్!..
ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా.. ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష కావడంతో.. కడప పట్టణంలో ఇంగ్లీష్ పేపర్ సెట్-3 లీక్ అవడం కలకలం రేపుతోంది.
కడప: ఇంటర్మీడియట్ పరీక్షల హడావుడి ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించేది లేదన్న నిబంధనపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది.
ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా.. ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష కావడంతో.. కడప పట్టణంలో ఇంగ్లీష్ పేపర్ సెట్-3 లీక్ అవడం కలకలం రేపుతోంది. లీకైన ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో విషయం అధికారుల దృష్టికి కూడా వెళ్లింది.

పేపర్ లీక్ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని ఆర్ఐఓ రవి పేర్కొనడం గమనార్హం. అయితే లీకైన ప్రశ్నాపత్రం ఇప్పటిదేనా? లేక గతేడాది పరీక్షలకు సంబంధించిందా? అన్నది పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇకపోతే ఈరోజు పరీక్షకు సెట్-1 ప్రశ్నాపత్రాన్ని అధికారులు ఎంపిక చేశారు.కాగా, పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీ నుంచి ఈ పేపర్ లీకేజీ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీకేజీ ఉదంతంపై అధికారులు విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications