విమెన్స్ డే విషెస్ చెబుతూ ఆ డిమాండ్ లేవనెత్తిన పవన్ కల్యాణ్..!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కీలక డిమాండ్ ను లేవనెత్తారు.

అమరావతి: ఇవ్వాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సీనియర్ నాయకులు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తోన్నారు. మహిళా సమానత్వం, సాధికారత కోసం ప్రభుత్వాలు మరింత క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుందని సూచిస్తోన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, స్వేచ్ఛ, సాధికారతను కల్పించాల్సి అవసరం ఉందని స్పష్టం చేస్తోన్నారు. మహిళలకు భద్రతను కల్పించిన సమాజం సంతోషమయమౌతుందంటూ వ్యాఖ్యానిస్తోన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళను శక్తి స్వరూపిణిగా, బహుకృత రూపిణిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు. మహిళలకు తాము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. మహిళ లేని ఇల్లు- దీపం లేని కోవెలతో సమానమని పేర్కొన్నారాయన.

International Womens day: Pawan Kalyan urges 33% reservation for women in legislatures

ఎక్కడ స్త్రీలు గౌరవం పొందుతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని, శాంతి సౌభగ్యాలు విలసిల్లుతాయని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. స్త్రీ సంపూర్ణ సాధికారతను సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రతి మహిళ కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని, దీని కోసం చట్టసభల్లో వారి సంఖ్యా బలం పెరగాల్సిన అవసరం ఉందని తాను బలంగా నమ్ముతున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ను తాము తమ ఎన్నికల ప్రణాళికలోనూ పొందుపరిచామని అన్నారు. ఈ దిశగా చిత్తశుద్ధితో తాను ప్రయత్నం చేస్తానని అన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తాము ఇదే డిమాండ్ ను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాలని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను కల్పించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని సూచించారు. చట్టసభల్లో వారి సంఖ్యాబలం పెరిగినప్పుడే మహిళలకు పూర్తి సాధికారత సాధ్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+