"హరిహర వీరమల్లు" విడుదల కాకుండా ఒత్తిడి.. సినిమా హాళ్ల బంద్..?
జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని, తక్షణమే విచారణ చేపట్టాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వివాదం వెనుక "హరిహర వీరమల్లు" సినిమా విడుదలకు ముందు థియేటర్లను మూసివేయాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు రావడంతో ఇది మరింత తీవ్రమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఈ పరిణామం ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి దుర్గేష్, కేవలం థియేటర్ల మూసివేత నిర్ణయం గురించే కాకుండా, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక 'కార్టెల్'గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపైనా విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఈ కార్టెల్ ఏ మేరకు సినీ పరిశ్రమను ప్రభావితం చేస్తోంది, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందా అనే కోణంలోనూ దర్యాప్తు జరగనుంది.
ఈ థియేటర్ల మూసివేత వల్ల ఎన్ని సినిమాలు ప్రభావితమవుతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూ నష్టం వాటిల్లుతుంది అనే అంశాలపై కూడా సమగ్ర వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. సినీ పరిశ్రమకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని, ఈ విషయంలో పూర్తి పారదర్శకతను నెలకొల్పుతామని శ్రీ కందుల దుర్గేష్ తేల్చిచెప్పారు. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యక్తులు త్వరలోనే వెలుగులోకి వస్తారని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications