భారీగా తగ్గిన ఐఫోన్ ధర

ఐఫోన్ 15 విడుదలవడానికి కొద్దిరోజులే సమయం ఉంది. అంతకన్నా ముందుగా ఒక శుభవార్త వచ్చింది.. ఐఫోన్ 13 ధర భారీగా తగ్గింది. ఫ్లిప్ కార్ట్ నుంచి చాలా తక్కువ ధరకు వినియోగదారులు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో iPhone 13 రూ.58,999 తో లిస్ట్ అయ్యింది. ఇదే అత్యంత తక్కువ ధర.

ఎటువంటి ఆఫర్లు లేకుండానే వినియోగదారులకు ఈ తగ్గింపు ధర లభిస్తోంది. HDFC బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఫ్లిప్ కార్ట్ మరో రూ.2వేలు తగ్గిస్తోంది. రూ.56,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే అమెజాన్ మాత్రం ఆఫర్ ఇవ్వడంలేదు. ప్రధానమైన విషయం ఏమిటంటే, రెండు ప్లాట్‌ఫారమ్‌లూ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఇస్తున్నాయి. తమ పాత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా ఈ బలమైన ఐఫోన్‌ను తక్కువ ధరకు పొందొచ్చు. తగ్గింపు అనేది ఫోన్ మోడల్, కండిషన్‌తో పాటు మీ ప్రాంతంలో ఎక్స్‌ఛేంజ్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

The release of iPhone 15 is just a few days away.

ఫీచర్లు పరిశీలిస్తే.. iPhone 13 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో వస్తోంది. వినియోగదారులకు ఆరు రంగుల ఆప్షన్లున్నాయి. స్టార్‌లైట్, పింక్, మూన్‌లైట్, రెడ్, బ్లూ, గ్రీన్ ఉన్నాయి. ఇందులో A15 బయోనిక్ చిప్ అమర్చివుంది. 13 డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. 12 మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా, ఫ్లాష్ లైట్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ సెకండ్ అల్ట్రా వైడ్ కెమెరాను కంపెనీ అందించింది. ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇది ఐఫోన్ 13, 5G ఫోన్. IP68 రేటింగ్‌తో వస్తోంది. దీనివల్ల ఇది నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంటుంది. బ్యాటరీ పవర్ పరిశీలిస్తే 19 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+