ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఖరారు - చంద్రబాబు ఎంపిక వెనుక..!!

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా ప్రక్షాళన ప్రారంభించారు. ఇప్పటికే కీలక హోదాల్లో ఉన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానాలు మార్పు చేసారు. నూతన డీజీపీని నియమించారు. ఇక..పాలనలో కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ గా చంద్రబాబు ఏరి కోరి అధికారిని ఎంపిక చేసుకున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆ అధికారిని రిలీవ్ చేయాలని కేంద్రానికి లేఖ రాసారు. కేంద్రం రిలీవ్ చేయటం ఆ అధికారి ఏపీ సర్వీసుల్లోకి తిరిగి వస్తూనే కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

రాష్ట్ర సర్వీసుకు లడ్డా
సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా. 1998 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ కేడర్ అధికారి. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్‌ అధికారుల సేవలను ఉపయోగించుకోవాలనుకుంటున్న సీఎం చంద్రబాబు ఆయనను మళ్లీ ఏపీ కేడర్‌లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఆయనను రాష్ట్ర సర్వీస్‌లోకి పంపుతూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో లడ్డాను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించటం దాదాపు ఖరారైంది.

IPS Mahesh Chandra Ladda likely to appoint as AP new Intelligence chief

నిఘా చీఫ్ గా బాధ్యతలు
మహేష్ చంద్రలడ్డా రాజస్థాన్ కు చెందిన వారు. ఆయన విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగానూ పనిచేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన సమయంలో 2005 ఏప్రిల్ 27న మావోయిస్టులు మహేశ్ చంద్రలడ్డాపై దాడికి చేశారు. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మావోయిస్టుల అణచివేతలో కఠినమైన నిర్ణయాల కారణంగా ఈ దాడి జరిగింది.ఆ తరువాత గుంటూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు. గుంటూరులోనూ నక్సల్స్ వేరివేతతో పాటు.. రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించారు.

IPS Mahesh Chandra Ladda likely to appoint as AP new Intelligence chief

చంద్రబాబు ఏరి కోరి
లడ్డా విజయవాడ డిప్యూటీ కమిషనర్ గానూ పనిచేసారు. విశాఖపట్టణం కమిషనర్ గానూ పనిచేశారు. 2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మహేష్ చంద్రలడ్డా ఉన్నారు. ఆ తరువాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ప్రస్తుతం మళ్లీ ఏపీ సర్వీసులోకి తిరిగిరానున్నారు. లడ్డా సమర్ధత పైన నమ్మకం ఉంచిన చంద్రబాబు ఏరికోరి కేంద్రం నుంచి రాష్ట్రానికి రప్పించటంతో పాటుగా కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+