Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సమ్మర్ కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజ్

వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులివ్వడంతో ఇంట్లో పిల్లలంతా ఒకటే గొడవ. నాలుగు రోజులు సెలవుపెట్టి పిల్లల్ని ఏవైనా కొత్త ప్రాంతాలు తిప్పి చూపిద్దాం అనే ఆలోచన అందరు తల్లిదండ్రుల్లో కలుగుతుంది. అటువంటివారిని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సాయి సన్నిధి పేరుతో విజయవాడ నుంచి షిరిడీకి ఈ ప్యాకేజ్ అమలవుతోంది. 3 రాత్రులు, 4 పగళ్లు ఉండే టూర్ వివరాలు.

విజయవాడ నుంచి ప్రతి మంగళవారం షిరిడీ టూర్ ప్రారంభమవుతుంది. సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు షిరిడీలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు శని శింగనాపూర్ లోని శనేశ్వర దేవస్థానాన్ని సందర్శించవచ్చు.

irctc shirdi tour package details

* మొదటిరోజు: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 10.15 గంటలకు సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా రైలు జర్నీ ఉంటుంది.

* రెండోరోజు: రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. అక్కడి నుంచి షిరిడీకి వెళ్లిన తర్వాత హోటల్ లో చెకిన్ అవ్వాలి. తర్వాత సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం సమయంలో షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి షిరిడీలోనే బస ఉంటుంది.

* మూడోరోజు: మూడో రోజు ఉదయం షిరిడీ నుంచి శని శింగనాపూర్ చేరుకొని శనీశ్వరుణ్ని దర్శించుకోవాలి. షిరిడి చేరుకున్న తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు నాగర్ సోల్ లో రైలు ఎక్కాలి.

* నాలుగోరోజు: నాలుగో రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు నాగర్ సోల్ నుంచి విజయవాడకు చేరుకోవడంతో సాయి సన్నిధి పర్యటన ముగుస్తుంది.

గ్రూప్ బుకింగ్‌లో నలుగురి నుంచి ఆరుగురు వరకు టికెట్లు బుక్ చేసుకోవాలి. స్టాండర్డ్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.4850, ట్విన్ షేరింగ్‌కు రూ.5,630, కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7310, ట్విన్ షేరింగ్‌కు రూ.8,080 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకునేదాంట్లో స్టాండర్డ్ ప్యాకేజీలో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5420, డబుల్ షేరింగ్‌కు రూ.6,930, సింగిల్ షేరింగ్‌కు రూ.12,280, కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7,880, డబుల్ షేరింగ్‌కు రూ.9,380, సింగిల్ షేరింగ్‌కు రూ.14,740 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ క్లాస్‌కి స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ క్లాస్‌కి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, 2 రోజులు బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవరవుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+