శ్రీవారి దర్శనానికి ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
ఏడుకొండలపై కొలువైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడం ఒక్కోసారి ఎంతో దుర్లభంగా మారుతుంది. అయితే తిరుమల భక్తులకు ఐఆర్ సీటీసీ శుభవార్త చెప్పింది. తక్కువ ఖర్చుతో స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రెండు రాత్రులు, మూడు పగళ్లు ఉండే ఈ టూర్ ధర రూ.4వేల లోపే ఉన్నట్లు సంస్థ పేర్కొంది. గోవిందం పేరుతో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ఈ ప్యాకేజీ ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. శ్రీవారి ప్రత్యేక దర్శనంతోపాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా దర్శించవచ్చు. లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లిలో 12734 నెంబరు నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ తో ప్రయాణం ప్రారంభమవుతుంది. తర్వాతరోజు ఉదయం 6.00 గంటలకు తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలో హోటల్ వసతి ఉంటుంది.

కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలయ్యాక శ్రీవారి దర్శనానికి తీసుకువెళతారు. ఉదయం 9.00 గంటలకు శ్రీవారిని ప్రత్యేక దర్శనం ఉంటుంది. అనంతరం తిరుపతికి తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం భోజనం ముగిసిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి తీసుకువెళతారు. అలివేలు మంగమ్మను దర్శించుకున్న తర్వాత తిరుపతి రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.25 గంటలకు 12733 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్కాలి. మూడోరోజు ఉదయం 7.00 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీలో అందించే సౌకర్యాలు
తిరుపతిలో హోటల్ వసతి, టిఫిన్, ఏసీ వాహనంలో ప్రయాణం, శ్రీవారి ప్రత్యేక దర్శనం, బీమా సౌకర్యం
టికెట్ ధరలు..
స్టాండర్డ్ ప్యాకేజీ (స్లీపర్ క్లాస్ ప్రయాణం): సింగిల్ షేరింగ్ ధర రూ.4,950. డబుల్, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.3,800
కంఫర్ట్ ప్యాకేజీ (థర్డ్ ఏసీ ప్రయాణం): సింగిల్ షేరింగ్ ధర రూ.6,790. డబుల్, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.5,660
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
హైదరాబాద్ TO ఊటీ.. తక్కువ ధరకే IRCTC సమ్మర్ ప్యాకేజీ -
పెరుగుతున్న బంగారం ధరల వేళ భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్, నేరుగా ఇంటికే..!! -
అలిపిరి లగేజీ కౌంటర్ లో ఈఓ చేసిన తనిఖీల్లో.. !! -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక -
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications