అలర్ట్: రైల్వే ప్రయాణికులందరికీ ముఖ్య గమనిక
IRCTC రైల్వే ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. అధికారిక ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect) యాప్‌లా కనిపించే ఫేక్ యాప్ ఒకటి హల్చల్ చేస్తోందని, దీనిపట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
సైబర్ క్రిమినల్స్ రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా ఎంచుకున్నారు. అప్రమత్తమైన IRCTC హెచ్చరికలు జారీచేసింది. ఈ నకిలీ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారని, దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవద్దని దేశవ్యాప్తంగా ప్రజలందరికీ సూచనలు జారీచేసింది. ఫిషింగ్ లింక్‌ల ద్వారా నకిలీ యాప్ సర్క్యులేట్ అవుతోందని, ఈ లింక్‌లు మంచి లింక్ ల్లా నకిలీ యాప్‌కు రీడైరెక్ట్ చేస్తాయని తెలిపింది.

IRCTC రైల్ కనెక్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ఏదైనా లింక్ వస్తే దానిపై క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది. అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌కి వెళ్లాలని సలహా ఇచ్చింది. యాప్ డెవలపర్ పేరును చెక్ చేయడం ద్వారా యాప్ అసలైనదా కాదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చంది.
నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండేందుకు ఈమెయిల్స్ లేదా మెసేజెస్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని, స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లతో అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలని తెలిపింది. స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ సెట్ చేసుకోవాలని, ఆన్‌లైన్ ఖాతాలన్నింటికీ 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రైవసీ ఫీచర్ ఆన్ చేసివుంచుకోవాలని, ఆన్‌లైన్‌లో ఏ సమాచారాన్ని షేర్ చేయకుండా జాగ్రత్త పడాలని సూచించింది. నకిలీ యాప్ నిజమైన యాప్ కంటే భిన్నమైన లోగో, కలర్ స్కీమ్ తో ఉంటుంది. నిజమైన యాప్‌లో ఉన్న ఫీచర్లు నకిలీ యాప్ లో ఉండవు. ఏదైనా సమస్య వస్తే IRCTC అధికారిక వెబ్‌సైట్ https://irctc.co.inలో లిస్ట్ అయిన అధికారిక నెంబర్లకు మాత్రమే ఫోన్ చేయాలి.












Click it and Unblock the Notifications